మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. అక్టోబర్ 1న ఆచార్య..!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఆచార్య సినిమా విడుదల పై క్లారిటీ వచ్చింది. ఆచార్య మూవీ సెప్టెంబర్ 30 లేదా.. అక్టోబర్ 1న విడుదల కానున్నట్లు సమాచారం. ఇప్పటికే తెలుగులో భారీ చిత్రాలన్నీ విడుదలకు సంబంధించి డేట్లు ఫిక్స్ చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ రానా హీరోలుగా నటిస్తున్న మలయాళ రీమేక్ మూవీ, మహేష్ బాబు సర్కారు వారి పాట, ప్రభాస్ రాధే శ్యామ్, వెంకటేష్, వరుణ్ తేజ్ ల ఎఫ్ 3 సంక్రాంతికి విడుదల కానున్నాయి. నాగార్జున నటిస్తున్న బంగార్రాజు సినిమా కూడా సంక్రాంతికి వస్తున్నట్లు సమాచారం.

ఇక మిగిలి ఉన్న భారీ చిత్రాల్లో అల్లు అర్జున్ పుష్ప, ఆచార్య ఉన్నాయి. తాజాగా పుష్ప సినిమా క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దసరా పండగ సందర్భంగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న ఆర్ఆర్ఆర్ విడుదల అవుతుండగా, సంక్రాంతికి వచ్చే సినిమాలు కూడా ఫిక్స్ అయ్యాయి.ఇక ఆచార్య ఒక్కటే మిగిలి ఉంది. దసరా, సంక్రాంతి సీజన్ లో ఆచార్యను విడుదల చేసేందుకు అవకాశం లేకపోవడంతో ఈ సినిమాను సెప్టెంబర్ 30 లేదా అక్టోబర్ ఫస్ట్ న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

ఎలాగూ అక్టోబర్ ఫస్ట్ వీక్ లో దసరా సందర్భంగా సెలవులు ఉంటాయి. 13వ తేదీ వరకు కొత్త సినిమాలు ఏవీ పోటీలో ఉండవు.ఆచార్య సినిమాకు సోలోగా రెండు వారాల పాటు థియేటర్లు అందుబాటులో ఉంటాయి. ఆర్ఆర్ఆర్ విడుదల అయినప్పటికీ ఎన్నో కొన్ని థియేటర్లు మిగిలే ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆచార్య సినిమా విడుదల తేదీని మేకర్స్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.

Also Read

పుష్ప రాజ్ వచ్చేస్తున్నాడు.. విడుదల తేదీ అనౌన్స్ మెంట్..!

సంక్రాంతికి పవన్ మూవీ..! విడుదలయ్యేది ఏ రోజంటే..!

హీరోగా అకీరా నందన్ లాంచ్ కన్ఫామ్..

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -