Saturday, April 20, 2024
- Advertisement -

అఫీషియల్: ఇచ్చట వాహనములు నిలుపరాదు రిలీజ్ డేట్ ఫిక్స్..!

- Advertisement -

అక్కినేని నాగేశ్వర రావు మనవడిగా, నాగార్జున మేనల్లుడిగా సినిమాల్లోకి హీరో గా ఎంట్రీ ఇచ్చాడు సుశాంత్. కాళిదాసు, కరెంట్, అడ్డా వంటి సినిమాలు వరుసగా చేసిన సుశాంత్ కు మాత్రం హిట్టు దక్కలేదు. హీరో రాహుల్ రవిచంద్రన్ దర్శకుడిగా పరిచయం అవుతూ కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన చిలసౌ మూవీ హీరోగా సుశాంత్ కు తొలి విజయాన్ని అందించింది. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురములో ఓ కీలక పాత్రలో నటించాడు సుశాంత్.

ఈ సినిమాలో సుశాంత్ పాత్ర చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినప్పటికీ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో సుశాంత్ కు కూడా గుర్తింపు దక్కింది. ఈ మూవీ తరువాత సుశాంత్ ఎస్ దర్శన్ దర్శకత్వంలో ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.ఈ సినిమాను ఏఐ స్టూడియోస్ అండ్ శాస్త్ర మూవీస్ బ్యానర్ ల కింద రవిశంకర్ శాస్త్రి, ఏక్త శాస్త్రి హరీష్ కొయ్యలగుండ్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ మీనాక్షి చౌదరి నటిస్తోంది.

వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఓ నవల కాన్సెప్టుతో విలక్షణమైన థ్రిల్లర్ గా రూపొందుతోంది. కాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఆగస్టు 27వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నిజానికి ఈ సినిమా మార్చి 12వ తేదీన విడుదల కావలసి ఉంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విడుదలలో ఆలస్యం జరిగింది.

Also Read

నిర్మాతలకు గట్టిగా క్లాస్ పీకిన నయనతార.. ఎందుకంటే..!

దాక్కో దాక్కో మేక.. పులి వచ్చేసింది..!

సింహా, లెజెండ్ ని మించేలా.. యాక్షన్ సీక్వెన్స్ కోసమే 80 రోజులు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -