నిర్మాతలకు గట్టిగా క్లాస్ పీకిన నయనతార.. ఎందుకంటే..!

- Advertisement -

కోలీవుడ్ కు చెందిన నయనతార దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటిస్తూ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. ఎవరికీ అందనంత రేంజ్ లో ఒక్కో మూవీకి రూ. 4 కోట్లు పారితోషికం తీసుకుంటోంది. నయనతార ఏ సినిమాలో నటించినా మూవీ విడుదలకు ముందు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనదు. ఇంటర్వ్యూలు కూడా ఇవ్వదు. ఈ మేరకు ఆమె సినిమా ప్రాజెక్టును ఓకే చేసే ముందే నిర్మాతలకు తన కండిషన్స్ చెప్పి ఒప్పంద సంతకాలు చేస్తుంది.

కాగా నయనతార తాజాగా తమిళ్ లో నెట్రికణ్ అనే సినిమాలో నటిస్తోంది. సైకో కిల్లర్ కథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2011 లో కొరియన్ భాషల్లో విడుదలైన బ్లైండ్ సినిమా కథ ఆధారంగా రూపొందుతోంది. ఈ సినిమాను నయనతార లవర్ విగ్నేష్ శివన్ నిర్మిస్తుండగా మిలింద రావు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమా రేపు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది. దీంతో కొద్ది రోజులుగా నయనతార ఈ సినిమా పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. పలు టీవీలకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది.

- Advertisement -

ఈ నేపథ్యంలో నిర్మాతల నుంచి నయనతార పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బయట సినిమాలకు సంబంధించి ఒక పబ్లిసిటీ కార్యక్రమానికి కూడా హాజరు కాని నయనతార సొంత సినిమా అనేసరికి జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది అంటూ మండిపడ్డారు. ఇది సారి కాదు అంటూ హితవు పలికారు. దీనిపైన నయనతార గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. తాను ఏ సినిమా ఒప్పుకున్నా ముందుగానే పబ్లిసిటీ కార్యక్రమాలకు హాజరు కానని చెబుతూ ఒప్పంద పత్రాలపై సంతకం చేస్తానని చెప్పారు.

అయితే ఈ మూవీ కోసం మాత్రం పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొంటానని ముందుగానే ఒప్పుకున్నట్లు తెలిపారు. అందువల్లే తాను ప్రమోషన్లలో పాల్గొంటున్నట్లు చెప్పారు. సినిమాల్లో అవకాశం ఇచ్చే ముందు తాను చెప్పిన కండిషన్లకు అంగీకరించి ఇప్పుడు విమర్శలు చేయడం ఏంటని ఆమె తనను విమర్శించే నిర్మాతలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కాగా ఈ సినిమాలో నయనతార ప్రధాన పాత్రలో నటిస్తుండగా, అజ్మల్, శరణ, ఇందూజ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార అంధురాలి పాత్రలో కనిపించనుంది.

Also Read

సుకుమార్, మహేష్ మధ్యే మనస్పర్థలు తొలగినట్టేనా..!

సినిమాల్లో కొనసాగింపుపై కాజల్ సంచలన ప్రకటన..!

ఓ రేంజ్ లో బీమ్లా నాయక్ ఎలివేషన్స్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -