Thursday, May 2, 2024
- Advertisement -

ఫేక్‌ ట్వీట్‌ చేసి అడ్డంగా బుక్కైన చంద్రబాబు

- Advertisement -

విశాఖపట్నంలో కానిస్టేబుల్‌పై వైఎస్సార్‌సీపీకార్యకర్త దాడి చేసినట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టిన ట్వీట్‌ నకిలీగా ఏపీ పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఏపీ పోలీసు ట్విట్టర్‌ హ్యాండిల్లో ఫ్యాక్ట్‌ చెక్‌ను పెట్టారు. అందులో‘ గౌరవనీయులైన విపక్ష నేత గారూ, మీరు పెట్టిన పోస్టు తప్పు. మీ ఆరోపణలు మరోసారి అబద్ధం. వైఎస్సార్‌సీపీ కార్యకర్త కింద పడిపోయిన అధికారి గాయానికి మసాజ్‌ చేస్తున్నాడు. ఇలాంటి నిరాధారమైన, తప్పుడు సమాచారానికి దూరంగా ఉండాలని కోరుతున్నాం’ అని పోలీసులు ట్వీట్‌ చేశారు.

కాగా, కానిస్టేబుల్‌పై వైఎస్సార్‌సీపీ కార్యకర్త దాడి చేస్తున్నాడంటూ.. ఓ ఫోటోను శుక్రవారం చంద్రబాబు నాయుడు ట్వీటర్‌లో ఫోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఓ వైఎస్సార్‌సీపీ కార్యకర్త కానిస్టేబుల్‌ను కొడుతున్నట్లుగా ఉంది. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కార్యాలయం ముందు ఈ ఘటన జరిగినట్లుగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయడానికి వచ్చిన వైసీపీ కార్యకర్త అడ్డుకున్న పోలీసును తల పట్టుకుని కొడుతున్నట్లుగా ఫొటోలో కనిపిస్తోంది. ఈ ఫొటోనూ కోట్‌ చేస్తూ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ అరాచకాలు మితిమీరాయంటూ, ఏకంగా పోలీసుపైనే దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. దీన్ని చూసిన వారికి నిజంగానే వైఎస్సార్‌సీపీ కార్యకర్త కానిస్టేబుల్‌పై దాడి చేస్తున్నాడా అన్నట్లుగా ఉంది. ఈ విషయాన్ని నేరుగా విపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు ట్వీట్‌ చేయడంతో జనం కూడా నిజమనే భావించారు. కానీ ఏపీ పోలీసులు ఇది ఫేక్‌ అని తేల్చడంతో చంద్రబాబు మరోసారి అడ్డంగా బుక్కకైపోయారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -