Monday, May 6, 2024
- Advertisement -

శృతి హాసన్ ఏ కష్టమైనా ఈజీగా తీసుకుంటుంది : తమన్నా

- Advertisement -

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో అప్ కమింగ్ హీరోయిన్లు తమ సీనియర్ హీరోయిన్లను ఫాలో కావడం చూస్తుంటాం. మీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం.. ఏ హీరోయిన్ ని ఆదర్శంగా తీసుకుంటారు అంటే పలానా హీరోయిన్ అని చెప్పేస్తుంటారు. అయితే హ్యాపీడేస్ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయిన మిల్కీ బ్యూటీ తాజాగా విశ్వనటుడు కమల్ హాసన్ కూతురు అందాల భామ శృతి హాసన్ గురించి తనదైన అభిప్రాయాన్ని వెల్లబుచ్చింది. ఇక హీరోయిన్ల మధ్య కెరియర్ పరమైన పోటీ ఎక్కువగా ఉంటుంది. అందువలన వాళ్ల మధ్య పెద్దగా స్నేహ సంబంధాలు ఉండదని చాలామంది అనుకుంటూ ఉంటారు.

మరికొంత మంది హీరోయిన్ల మద్య మాత్రం అత్యంత సన్నిహిత సంబంధాలు ఉంటాయి. తమ అభిరుచులు .. అలవాట్లు కూడా ఒక్కటే అనుకున్నప్పుడు ఆ స్నేహం మరింత బలపడుతుంది. అలాంటి స్నేహితులే తమన్నా, శృతి హాసన్. తాజా ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ .. శృతి హాసన్ ఎప్పుడు చూసినా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. తన కష్టాన్ని ఎవరికీ కనిపించకుండా చాలా జాగ్రత్త తీసుకుంటుంది.

శృతి హాసన్ నేను తరుచూ కలుస్తుంటాం.. ఫోన్ లో మాట్లాడుకుంటూనే ఉంటాం. ఎలాంటి సమస్యలైనా లైట్ తీసుకుని సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. ఓ వైపున షూటింగులు చక్కబెడుతూనే, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎలాంటి సమస్యలైనా లైట్ తీసుకుని సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. నిజంగా తనలా ఉండగలగడం చాలా కష్టం. నేను ఎప్పుడైనా బాధపడితే నాకు ఎంతో ధైర్యం చెబుతుందని అన్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో యంగ్ హీరో.. ఎవరంటే?

అడిగిందంతే.. వరలక్ష్మి శరత్ కుమార్ కోసం కదిలిన తారలు..?

ఏపీలో 20 వరకు కర్ఫ్యూ పొడగింపు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -