Monday, May 6, 2024
- Advertisement -

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పీఆర్సీ, లాక్ డౌన్ పై కీలక నిర్ణయం!

- Advertisement -

తెలంగాణ కేబినెట్ సమావేశం మంగళవారం నాడు జరగనుంది. లాక్‌డౌన్‌తో పాటు ఉద్యోగుల పీఆర్సీపై ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిపోవడం, కొత్త కేసుల నమోదు అదుపులోకి రావడంతో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సడలింపులు ఇవ్వాలనే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌ అమలుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టంపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు మంత్రిమండలికి నివేదించనున్నారు. గత నెల చివర్లో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో లాక్‌డౌన్ ను జూన్ 9వ తేదీకి పొడిగించింది ప్రభుత్వం.

అయితే లాక్‌డౌన్ ఆంక్షలకు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటలకు మినహయింపు ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ ను కొనసాగించాలా, ఎత్తివేయాలా అనే విషయమై కూడ నిర్ణయం తీసుకోనున్నారు. పగలు పూట లాక్‌డౌన్ ఎత్తివేసి రాత్రిపూట కర్ఫ్యూను కొనసాగించే విషయమై కూడ ఈ సమావేశంలో చర్చించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. వేతన సవరణకు సంబంధించి ఆర్ధికశాఖ ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను సమర్పించింది. ఈ నివేదికకు కేబినెట్ ఇవాళ ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం. పీఆర్సీ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపితే ఇవాళ లేదా రేపు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయం కోసం ఉద్యోగులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.

రైతుబంధు పేరుతో పెట్టుబడి సాయాన్ని అందించడం, విత్తనాలను అందుబాటులో ఉంచడం, నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టడం, ఎరువులు-పురుగుమందులను తగిన మోతాదులో సమకూర్చుకోవడం.. ఇంటర్ సెకండియర్ పరీక్షలతో పాటు రేపటి నుండి ప్రారంభించనున్న డయాగ్నస్టిక్ సెంటర్లపై కేసీఆర్ మంత్రులకు దిశానిర్ధేశం చేయనున్నారు.

శృతి హాసన్ ఏ కష్టమైనా ఈజీగా తీసుకుంటుంది : తమన్నా

ఒక్క అభిమాని లేకున్నా నా గుండే బద్దలవుతుంది: బాలయ్య

అనిల్ రావిపూడి దర్శకత్వంలో యంగ్ హీరో.. ఎవరంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -