Friday, May 17, 2024
- Advertisement -

బాబుతో కుదరలేదు.. ఇప్పుడు టీనేజీలో సెక్స్..

- Advertisement -
Tejaswi in Balak palak Remake

హీరోయిన్ ఫ్రెండు.. చెల్లెలు టైపు రోల్స్ గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి తేజస్వి మదివాడ. ఈ భామ ఇప్పుడు హీరోయిన్ గా ఎదగాలని కలలు కంటోంది. ‘ఐస్ క్రీమ్’ సినిమాతో హీరోయిన్ అవతారమెత్తిన తేజస్వి.. ఆ తర్వాత కేరింత.. రోజులు మారాయి లాంటి సినిమాల్లో వన్ ఆఫ్ ద హీరోయిన్స్ గా చేసింది కానీ.. ఆ సినిమాలేవి ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు.

తనకున్న ‘క్యూట్’ ఇమేజ్ పోయి.. ‘హాట్’ అనిపించుకోవాలని ఆమె అప్పుడప్పుడూ కొన్ని ప్రయత్నాలు చేస్తోంది. రీసెంట్ గా ‘బాబు బాగా బిజీ’ సినిమాలో కుర్రాళ్లను రెచ్చగొట్టే పాత్రలో కనిపించింది. కానీ అదేమంత మంచి ఫలితాన్నివ్వలేదు. ఆ సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో తేజస్వి ఆశ నెరవేరేలా లేదు. తేజస్వి ఇప్పుడు మరో అడల్ట్ కామెడీ మూవీలో చేయబోతుండటం విశేషం. ఇందులో ఆమెది సహాయ పాత్ర కాదు. లీడ్ హీరోయిన్ రోల్. కథంతా కూడా ప్రధానంగా ఆమె చుట్టూనే తిరుగుతుంది.

ఇది కూడా రీమేకే కావడం విశేషం. మరాఠీలో విజయవంతమైన ‘బాలక్ పాలక్’ అనే అడల్ట్ కామెడీ రీమేక్ లో ముఖ్య పాత్ర చేయబోతోంది తేజస్వి. ఈ సినిమా సెక్స్ ఎడుకేషన్ నేపథ్యంలో వినోదాత్మకంగా సాగుతుంది. టీనేజీలో సెక్స్ కోసం తపించే కుర్రాళ్లలో మార్పు తీసుకొచ్చే అమ్మాయి కథ ఇది. ఫన్నీగా సాగుతూనే చివరగా సందేశంతో ముగుస్తుందీ చిత్రం. ఈ సినిమా మరాఠీలో పెద్ద హిట్టయింది. శ్రీకాంత్ వెలగలేటి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు.

{youtube}bskjFX6NVwE{/youtube}

Related

  1. స్టార్ హీరోయిన్ ముందు.. ఆ యువకుడు బట్టలు విప్పి ఏం చేసాడో తెలుసా..?
  2. హీరోయిన్ బూతు మెసేజ్ పంపిన యువకుడు.. హీరోయిన్ ఏం చేసిందో తెలుసా?
  3. భర్తకు తెలియకుండా కులుకుతున్న హీరోయిన్.. భర్త ఏం చేసాడో తెలుసా..?
  4. ప్రభాస్ కు సీక్రెట్ గా ఆ పని చేసినా స్టార్ హీరోయిన్.. ఎవరా హీరోయిన్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -