Thursday, May 2, 2024
- Advertisement -

పాక్ భూభాగంలోని ఉగ్రతండాలను ముసివేయ‌క‌పోతే మేమే అప‌నిచేస్తాం

- Advertisement -
Iran warns will hit militant “safe havens” inside Pakistan

తీవ్ర‌వాద గ్రూపుల‌కు పుట్టినిల్లు పాకిస్థాన్‌. ఇది ప్ర‌పంచానిక తెలుసు.నిత్యం కాల్పుల విర‌మ‌న‌ను ఉల్లంగించి దొంగ చాటుగా దెబ్బ‌తీయ‌డం పాక్‌కు అల‌వాటుగా మారింది.దొంగ‌చాటుగా ఇద్ద‌రు భార‌త జ‌వాన్ల‌ను హ‌త‌మార్చిన పాక్‌కు భార‌త్ ఆర్మీ దిమ్మ‌తిరిగే స‌మాధానం చెప్పింది.పాక్ చెందిన బంక‌ర్‌ను 60 సెకెన్ల‌లో ధ్వంసంచేసి ఆర్మీ స‌త్తా ఏమిటో పాక్‌కు రుచి చూపిపంచింది. భార‌త్‌తో నిత్యం త‌గువులాడె పాక్ ఇప్పుడు త‌న స‌రిహ‌ద్దు దేశ‌మైన ఇరాన్‌తోకూడా త‌గువులు పెట్టుకుంటోంది.

అందుకే ఉగ్రవాదుల తయారీకేంద్రంలా మారిన పాకిస్థాన్ కు ఇరాన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాదులకు సాయం చేయడాన్ని వెంటనే ఆపివేయాలని… లేకపోతే పాక్ భూభాగంలో ఉండే ఉగ్రవాద శిబిరాలపై దాడి చేస్తామని హెచ్చరించింది. క్రాస్ బోర్డర్ టెర్రరిజానికి పాల్పడుతున్న సున్నీ మిలిటెంట్లను వెంటనే నియంత్రించాలని తెలిపింది.లేకుంటె తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌న ఘాటుగా హెచ్చ‌రించింది.

ఇరాన్‌-పాకిస్థాన్ స‌రిహ‌ద్దు వ‌ద్ద ఇటీవ‌ల ఉగ్ర‌వాదుల ఆగ‌డాలు ఎక్కువ‌య్యాయి. జైష్‌-అల్‌-అదిల్ మిలిటెంట్ సంస్థ ఇటీవ‌ల ఇరాన్ స‌రిహ‌ద్దు జ‌వాన్ల‌ను హ‌త‌మార్చింది. దీన్ని ఇరాన్ సీరియ‌స్ తీసుకున్న‌ది. పాకిస్థాన్‌లో ఉన్న‌ మిలిటెంట్లు లాంగ్ రేంజ్ గ‌న్నుల‌తో ఇరాన్ ద‌ళాల‌ను మ‌ట్టుబెట్టాయి. డ్ర‌గ్ స్మ‌గ్లింగ్ గ్యాంగ్‌లు, వేర్పాటువాద మిలిటెంట్ల‌తో ఇరాన్‌-పాక్ బోర్డర్ ఎప్పుడూ టెన్ష‌న్ టెన్ష‌న్‌గా ఉంటుంది. ఒక‌వేళ ఇలాగే ఉగ్ర‌వాదులు దాడులు కొన‌సాగిస్తే, తాము ఉగ్ర స్థావ‌రాల‌పై దాడులు చేస్తామ‌ని ఇరాన్‌కు చెందిన ర‌క్ష‌ణ మంత్రి తెలిపారు.

సున్నీ ఉగ్రవాదులను అరెస్ట్ చేసి, ఉగ్రతండాలను పాక్ ప్రభుత్వం మూసి వేస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ పాకిస్థాన్ ఆ పని చేయకపోతే… తామే ఆ పని చేస్తామని, పాక్ భూభాగంలోని ఉగ్రతండాలను ఏరివేస్తామని హెచ్చరించారు.దీంతో దిగి వ‌చ్చిన పాక్ స‌రిహ‌ద్దుల భ‌ద్ర‌త పెంచుతామ‌ని ప్ర‌క‌టించింది.

Related

  1. ప్ర‌పంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తున్న భార‌తీయ రైల్వే
  2. చంద్రబాబుకు ఊహించని షాక్.. వైసీపీలో కి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే
  3. ట్రంప్, పుతిన్‌లు సిరియా కంటే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తీరుపైనే ఎక్కువగా చర్చించినట్లు సమాచారం….
  4. ప్ర‌త్యేక‌హోదాకు దిక్కులేదు గాని.. ఆస్కార్ అవార్డు అవసరమా..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -