Tuesday, April 30, 2024
- Advertisement -

లోకేశ్ పాదయాత్ర సర్వం సిద్దం.. జగన్ తో పోలికా ?

- Advertisement -

ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి గతంతో పోలిస్తే చాలా బలహీనంగా ఉందనే చెప్పాలి. పార్టీ ఆవిర్భావం నుంచి ఏపీలో తిరుగులేని శక్తిగా ఉన్న టీడీపీ గత ఎన్నికల్లో ఊహించని పరాభవాన్ని ఎదుర్కొంది. కేవలం 24 సీట్లకే పరిమితం అయ్యి ఆ పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోర ఓటమిని చవి చూసింది. దీంతో ఏపీలో టీడీపీ పనైపోయిందనే వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుంది. దీంతో ఈసారి 2024 ఎన్నికలు టీడీపీ పార్టీకి అత్యంత కీలకం. ఆ పార్టీ పునః వైభవం పొందాలంటే వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో గెలుపు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాలకు పదును పెడుతూ.. పార్టీని తిరిగి బలపరిచే పనిలో ఉన్నారు.

జగన్ ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా ప్రజల్లోకి తీసుకెల్లే ప్రయత్నం చేస్తున్నారు బాబు. ఇక ఆయన తనయుడు లోకేశ్ కూడా తన వంతు బాధ్యతను గట్టిగానే నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకోచ్చేందుకు లోకేశ్ పాదయాత్ర చేపట్టబోతున్నారని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఎప్పుడు చేపడతారు అనే దానిపై రకరకాల వార్తలు వినిపించాయి. తాజాగా లోకేశ్ పాదయాత్రకు సంబంధించి టీడీపీ శ్రేణులు స్పష్టత ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరి 27 నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంబించబోతున్నారట. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకులం జిల్లా ఇచ్చాపురం వరకు పాదయాత్ర సాగానున్నట్లు సమాచారం.

పాదయాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ కూడా పూర్తి పూర్తయినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉండడంతో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే లోపు పాదయాత్ర ముంగించే విధంగా రూట్ మ్యాప్ సిద్దం చేశారట టీడీపీ శ్రేణులు. ఇక పాదయాత్రలో జగన్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ.. పార్టీ విధానాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారట లోకేశ్. గతంలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ శర్మిల, వైఎస్ జగన్ .. పాదయాత్రలు చేపట్టి ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే.. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్.. అధికారంలోకి రావడానికి పాదయాత్రలు ఎంతగానో దోహదపడ్డాయి. మరి లోకేశ్ కూడా జగన్ మాదిరి పాదయాత్రలో ప్రజలను ఎంతవరకు ఆకర్షించగలరో చూడాలి.

ఇవి కూడా చదవండి

కుప్పంలో జగన్.. పులివెందులలో బాబు.. నిలిచి గెలిచేదెవ్వరు ?

ప్రశ్నలెన్నో.. సమాధానం చెప్తారా మోడీజీ !

రాష్ట్రాన్ని పాలించేది గవర్నర్లా .. ముఖ్యమంత్రులా ? అసలేంది ఈ రచ్చ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -