Sunday, April 28, 2024
- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు.. తెలుగు సినీ చరిత్రలో చెరిగిపోని సంతకం !

- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు. డేరింగ్ డాషింగ్ నిర్ణయాలతో తెలుగు సినిమా ఖ్యాతి పెంచిన ఆ లెజెండరీ నటుడు ఇక కనిపించరు. నటనలో వైవిధ్యం కనబరుస్తూ రెండు దశాబ్దాలు తెలుగు చిత్రసీమలో నెంబర్ ఒన్ హీరోగా కొనసాగిన నటశేఖరుడు ఇక లేరు. 79 సంవత్సరాల వయసు ఉన్న సూపర్ స్టార్ కృష్ణ కు ఆదివారం గుండె పోటు రావడంతో కాంటినేటల్ ఆస్పత్రి లో చేర్చారు కుటుంబసభ్యులు. వయసు కారణంగా పలు రకాల శ్వాసకోశ సంబంధిత ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్న కృష్ణ.. కోలుకోవడం కష్టమేనని, ఆయనను కాపాడేందుకు అన్నీ విధాలా ప్రయత్నిస్తామని డాక్టర్లు చెప్పినప్పటికి, లాభం లేకుండా పోయింది.

24 గంటలు వెంటిలేటర్ పైనే చికిత్స పొందిన కృష్ణ.. ఈ రోజు ( మంగళవారం ) వేకువ జామున కన్ను మూశారు. సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, తెలుగు సినీ ప్రపంచం శోక సంద్రంలో మునిగింది. సూపర్ స్టార్ కృష్ణ 1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి సినిమాలపై అమితమైన ఆసక్తి ఉండడంతో తన తండ్రి రాఘవయ్య చౌదరి ప్రోత్సాహంతో సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాకముందు ఆయన మొదట ఎన్ టి రామారావు ప్రోత్సాహంతో పలు నాటకాల్లో కూడా నటించారు.

తెనాలికి చెందిన ప్రముఖ నాటక రచయిత కొడాలి గోపాలరావు ద్వారా ” చేసిన పాపం కాశీకి వెళ్ళేనా ” అనే నాటకంలో రెండో హీరోగా నటించారు. అందులో మొదటి హీరో శోభన్ బాబు. ఆ తరువాత కుల గోత్రాలు ( 1961 ), పదండి ముందుకు ( 1962 ), పరువు ప్రతిష్ట ( 1963 ) వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో మెరిశారు. ఆ తరువాత 1965 లో వచ్చిన తేనె మనసులు మూవీ ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొదటి సినిమానే తిరుగులేని విజయం సాధించడంతో.. అందరి దృష్టి కృష్ణపై పడింది. ఇక ఆ తరువాత వరుస సినిమాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల్లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకొని, అగ్రహీరోగా వెలుగొందారు. తెలుగు సినిమాకు టెక్నాలజీలో ఓనమాలు నేర్పిన ఘనత కృష్ణ గారికే దక్కుతుంది.

తన మొదటి సినిమా తేనెమనసులు ఫస్ట్ సోషల్ కలర్ మూవీగా గుర్తింపు పొందింది. ఆ తరువాత ఫస్ట్ జేమ్స్ బాండ్ మూవీ గూఢచారి 116 ( 1966 ), ఫస్ట్ సినిమా స్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజు ( 1974 ), ఫస్ట్ ఈష్ట్ మన్ కలర్ మూవీ ఈనాడు ( 1982 ), ఫస్ట్ 70ఏంఏం మూవీ సింహాసనం ( 1986 ), అలాగే మొదటి డీటీఎస్ మూవీ తెలుగువీర లేవరా ( 1995 ), ఇలా ప్రతి టెక్నాలజీని మొట్టమొదటగా తెలుగు సినిమాకు పరిచయం చేసిన ఘనత కృష్ణ గారిదే. అందుకే ఆయనను తెలుగు సినీ ఇండస్ట్రీ కి డేరింగ్ డాషింగ్ లెజెండరీ యాక్టర్ అని పిలుస్తారు. ఇక ఆయన సినిమా రంగానికి అంధించిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2009 లో పద్వా భూషణ్ తో సత్కరించింది. ఏది ఏమైనప్పటికి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన సూపర్ స్టార్ కృష్ణ ఇకపై లేకపోవడం తీరనిలోటు అనే చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -