Friday, May 3, 2024
- Advertisement -

లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ కు విజయ్ ఛాన్స్ ఇచ్చాడా ?

- Advertisement -

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ” లైగర్ ” ఫ్లాప్ తరువాత కొంత డల్ అయ్యాడనే చెప్పవచ్చు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న లైగర్ తీవ్రంగా నిరాశపరచడంతో తన నెక్స్ట్ సినిమాలపై చాలా జాగ్రత్త వహిస్తున్నాడట. ఒకవేళ లైగర్ హిట్ అయి ఉంటే నేషనల్ స్టార్ గా విజయ్ పేరు మారుమ్రోగేది. కానీ లైగర్ ఫలితం విజయ్ ఆశలను ఆవిరి చేసింది. లైగర్ ఎఫెక్ట్ తో పూరీ డైరెక్షన్ లోనే అనౌన్స్ చేసిన ” జనగణమన ” మూవీ కూడా ఆగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం విజయ్ చేతిలో శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న” ఖుషీ ” మూవీ మాత్రమే ఉంది. ఈ మూవీ కూడా విడుదల విషయంలో జాప్యం జరుగుతూనే ఉంది. .

ఇక ఖుషీ తరువాత వాట్ నెక్స్ట్ అంటే.. విజయ్ తో మూవీ చేయడానికి ఓ ఇద్దరు దర్శకులు లైన్లో ఉన్నప్పటికి విజయ్ మాత్రం ఆచితూచి అడుగు వేస్తున్నాడట. ఇప్పటికే విజయ్ కోసం హరీష్ శంకర్, గౌతమ్ తిన్ననూరి వంటి దర్శకులు కథలతో సిద్దంగా ఉన్నారు. కానీ విజయ్ మాత్రం ఒకే చెప్పడానికి సంకోచిస్తున్నడని ఫిల్మ్ నగర్ ఇన్ సైడ్ టాక్. ఇక విజయ్ తో మూవీ చేసేందుకు.. విజయ్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసిన శేఖర్ కమ్ముల కూడా ఓ స్టోరీ సిద్దం చేసినట్లు. తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి మద్య కథ చర్చలు కూడా జరిగాయట. దాదాపుగా విజయ్ శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ కే ఒకే చెప్పే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

గతంలో విజయ్ దేవరకొండను లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయం చేశాడు శేఖర్ కమ్ముల. ఇప్పుడు విజయ్ హీరోగా ఓ మూవీ చేయబోతున్నాడు. అయితే శేఖర్ కమ్ముల ఆ మద్య తమిళ స్టార్ హీరో దనుష్ తో ఓ మూవీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏమైందో తెలియదు గాని ఆ ప్రాజెక్ట్ నుంచి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దాంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని, అందుకే శేఖర్ కమ్ముల విజయ్ తో మూవీ ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ ని ఫిల్ గుడ్ మూవీస్ తీసే శేఖర్ కమ్ముల ఎలా చూపిస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి

అల్లు అర్జున్ కోసం రాసిన కథలో ఎనర్జీటిక్ హీరో ?

ఎన్టీఆర్ కొరటాల మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ?

మహేశ్ బిస్ట్ మోడ్.. సిక్స్ పాక్ కోసమేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -