తమిళనాట రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ఇళయ దళపతి విజయ్. ఆయన సినిమా విడుదలయ్యిందంటే ఫ్యాన్స్‌కు పూనకాలే. ఆయన సినిమాకు మార్కెట్ కూడా భారీ స్థాయిలో ఉంటుంది. ఒక్కసారైన విజయ్‌తో నటించాలని ఎందరో హీరోయిన్స్ కలలు కంటూ ఉంటారు. ఈనెల 22 న విజయ్ పుట్టినరోజు. ఆయన పుట్టినరోజును ఘనంగా జరుపుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నా.. అందుకు కరోనా నిబంధనలు అడ్డొస్తున్నాయి.
విజయ్ పుట్టినరోజు సందర్భంగా సెవెన్ స్క్రీన్ స్టూడియో ఓ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. విజయ్ గత చిత్రం మాస్టర్‌ను సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మించిన విషయం తెలిసిందే. విజయ్ ఇప్పటివరకు మొత్తం 64 సినిమాల్లో నటించాడు. దీంతో ఈ 64 పాత్రలకు సంబంధించిన గెటప్స్‌తో సెవెన్ స్క్రీన్ స్టూడియో ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పిక్ వైరల్‌గా మారింది. ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్ ఈ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు.

Also Read: బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడితో తారక్ మూవీ..!
ప్రస్తుతం విజయ్ 65వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ నెల 21న సాయంత్రం 6 గంటలకు ఇందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదల కానున్నది.అభిమాన సంఘాలు, వ్యక్తిపూజలు తమిళనాడులో మనకంటే కాస్త ఎక్కువే ఉంటాయి. తమ అభిమాన నటుడి నిలువెత్తు కటౌట్ కు పాలాభిషేకాలు చేయడం అక్కడ చాలా కామన్. ఇక విజయ్ ఫ్యాన్స్ ఈ పుట్టినరోజున ఏ విధంగా జరుపుకుంటారో వేచి చూడాలి.
Also Read:బన్నీ అస్సలు తగ్గేటట్టు లేడుగా..!