తెలంగాణలో థియేటర్లు ఓపెన్ చేసుకొనేందుకు అనుమతి ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ కొన్ని ఆంక్షలతో థియేటర్లు తెరుచుకొనేందుకు అవకాశం కల్పించారు. అయినప్పటికీ థియేటర్లు ఇంకా ఓపెన్ చేయడం లేదు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. లాక్‌డౌన్‌తో తాము ఎంతో నష్టపోయామని.. ప్రభుత్వం విద్యుత్ చార్జ్‌లు మాఫీ చేయాలని థియేటర్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఓటీటీలో సినిమాలు విడుదల చేయడం పట్ల థియేటర్ యాజమాన్యాలు గుర్రుగా ఉన్నాయి. ఈ వివాదం ఇలా నడుస్తుండగానే.. ఓ సంచలన నిర్ణయం బయటకొచ్చింది.
నారప్ప, దృశ్యం 2, విరాటపర్వం సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఈ మూడు సినిమాలు సురేష్ ప్రొడక్షన్స్ ప్రత్యక్ష, పరోక్ష భాగస్వామ్యం ఉన్నవే కావడం గమనార్హం. ఓటీటీలో సినిమాల విడుదలపై థియేటర్ యజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా.. సురేష్ ప్రొడక్షన్స్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నది. నారప్ప సినిమాలో వెంకటేశ్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ధనుష్ నటించిన అసురన్ మూవీకి ఇది రీమేక్.
సురేష్‌బాబు, కలైపులి ఎస్ థాను సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. జూలై 20 నుంచి ఈ సినిమా అమేజాన్‌లో స్ట్రీమింగ్ కానున్నది. నారప్పకు 40 కోట్ల రూపాయలు చెల్లించినట్లు టాక్. దీనితో పాటు దృశ్యం 2 కూడా ఓటీటీలోనే విడుదల కాబోతున్నది. ‘దృశ్యం 2’ అయితే శాటిలైట్, డిజిటల్, డైరెక్ట్-ఓటీటీ కలిపి డిస్నీ+హాట్‌స్టార్ మొత్తం 36 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. వీటితోపాటు రానా, సాయిపల్లవి నటించిన విరాట పర్వం కూడా ఓటీటీలో విడుదల కాబోతున్నది. ఈ చిత్రం ఎంత ధర పలికిందన్న విషయం త్వరలోనే తేలనున్నది.
Also Read
బోయపాటి కథకు ఫిదా ..! గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బన్నీ..!
