రాజ్ తరుణ్ కి వింత జబ్బు ఉన్న సంగతి మీకు తెలుసా..?

Title Sentiment for Raj Tarun

కోలీవుడ్ లో  ‘పసంగ-2’ పేరుతో తీసిన మూవీని తెలుగులో ‘మేము’ పేరుతో అనువాదమైన విషయం తెలిసిందే. గత ఏడాది రిలీజ్ అయిన మేము.. కమర్షిల్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయిన మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో రామ్ దాస్ అనే నటుడు చేసిన పాత్ర భలే ఫన్నీగా ఉంటుంది.

{loadmodule mod_custom,Side Ad 1}

పెద్ద జాబ్ చేస్తున్నప్పటికి.. అతడికి చిన్న చిన్న దొంగతనాలు చేసే అలవాటుంటుంది. తన కంపెనీ తరఫున 5 స్టార్ హోటల్లో కాన్ఫరెన్సుకు వెళ్లి.. అక్కడ లంచ్ చేసేటపుడు స్పూన్లు అవీ దొంగిలిస్తాడతను. ఇదో రకమైన వింత జబ్బన్మమాట. దీన్ని ‘క్లెప్తమేనియా’ అంటారు. ఇప్పుడు ఇదే వింత జబ్బున్న పాత్రను టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ చేస్తున్నట్లు సమాచారం. ‘అంధగాడు’ తర్వాత రాజ్ తరుణ్..‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ బేనర్లోనే మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

{loadmodule mod_custom,Side Ad 2}

ఆ మూవీ పేరు ‘రాజు గాడు’. ఈ సినిమాతో లేడీ డైరెక్టర్ సంజన రెడ్డి తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇందులో ఏ దురుద్దేశం లేకుండా చిలిపి దొంగతనాలు చేసి చిక్కుల్లో పడే పాత్రలో కనిపిస్తున్నాడట రాజ్. ఇంతకుముందు ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’లో కుక్కల్ని దొంగిలించే పాత్రలో ఎంటర్టైన్ చేసిన రాజ్ తరుణ్ కు.. ఈసారి కూడా అలాంటి ఫన్నీ క్యారెక్టరే పడ్డట్లుంది. ‘అంధగాడు’లో బ్లైండ్ క్యారెక్టర్లో కూడా రాజ్ తరుణ్ బాగానే నవ్వించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే రాజ్.. అనిల్ సుంకర నిర్మాణంలో మూడు సినిమాలు చేశాడు. ‘రాజు గాడు’ ఆ బేనర్లో అతడికి నాలుగో సినిమా కావడం విశేషం. 

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. రాజ్ తరుణ్ కి పెళ్లి అయిపోయింది.. నిజం చెప్పిన హెబ్బా
  2. ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ.. మాహిష్మతి రాజ్యంలోనే ప్రభాస్, అనుష్కల పెళ్లి
  3. అతనితో డేటింగ్ చేశా.. రాజ్ తరుణ్ తో ఎఫైర్..
  4. రవి, శ్రీముఖిల ఎఫైర్ పై నిజాలు బయట పెట్టిన ధనరాజ్