Sunday, May 4, 2025
- Advertisement -

నటనకు గుడ్ బై చెప్పనున్న రంగం హీరోయిన్!

- Advertisement -

అలనాటి తార రాధా హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షక ఆదరణ సంపాదించుకున్నారో మనకు తెలిసిందే. ఈక్రమంలోనే ఈమె నటన వారసురాలిగా తన కూతురు కార్తీక, అక్కినేని నాగచైతన్య సరసన జోష్ సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేశారు. ఈమె 2009వ సంవత్సరంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి కేవలం పలు సినిమాలలో మాత్రమే నటించారు. అయితే ఆమె నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

జోష్ సినిమా ద్వారా తెరపై సందడి చేసిన కార్తికా నాయర్ ఆ తర్వాత రంగం సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ సరసన దమ్ము, అల్లరి నరేష్ బ్రదర్ అఫ్ బొమ్మాలి వంటి సినిమాలలో నటించిన ఈమెకు పెద్దగా కలిసి రాలేదు.
2016లో విడుదలైన ‘వా డీల్‌’ తర్వాత ఆమె ఏ ఇతర ప్రాజెక్ట్‌కి సంతకం చేయలేదు.

Also read:టీచర్ జాబ్ సంపాదించిన మలయాళ బ్యూటీ!

ఈ విధంగా సినిమాలకు దూరంగా ఉంటున్న కార్తీక నాయర్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి.ఈమె తాజాగా ఒక వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారని తన వ్యాపారాన్ని విస్తరించుకుని ప్రయత్నాలు చేస్తున్నారనే సమాచారం వినబడుతోంది. ఈ క్రమంలోనే కార్తిక ఇకపై సినిమాలకు స్వస్తి పలికి తన వ్యాపారంలోనే స్థిరపడాలని భావించినట్లు నెటిజన్లు భావిస్తున్నారు.

Also read:త్వరలోనే శివతో సూర్య సినిమా.. ఎప్పుడొస్తుందంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -