Friday, April 26, 2024
- Advertisement -

టీచర్ జాబ్ సంపాదించిన మలయాళ బ్యూటీ!

- Advertisement -

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తాజాగా సెకండరీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లో 77 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది… అదేంటి ఇకపై అనుపమ సినిమాలకు గుడ్ బై చెబుతున్నారా? టీచర్ వృత్తిలో సెటిల్ కావాలని భావిస్తున్నారా.. అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే టీచర్ కావాలని అనుపమా పరమేశ్వరన్ కోరిక అవునో కాదో తెలియదు కానీ ఆమెను టీచర్ వృత్తిలో కూర్చోబెట్టాలని బీహార్ ప్రభుత్వం గట్టిగానే అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే బీహార్ విద్యాశాఖ టెట్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్ష ఫలితాలలో రిషికేశ్‌ కుమార్‌ అనే వ్యక్తి 77 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. అయితే అతని స్కోర్ కార్డులో అతని ఫోటోకి బదులుగా అనుపమ పరమేశ్వరన్ ఫోటో ఉండడం చూసి ఆశ్చర్యపోయిన రిషికేశ్ ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు . అదే విధంగా ఇలా అనుపమ ఫోటో రావడం మొదటిసారి కాదు. నా అడ్మిట్ కార్డులో కూడా అనుపమ ఫోటో వచ్చింది ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాటిని సరి చేస్తామని చెప్పారు.కానీ అది అలాగే ఉండటం వల్ల స్కోర్ కార్డు లో కూడా తన ఫోటో వచ్చినట్లు వాపోయాడు.

Also read:పన్నీర్ పాయసం ఎప్పుడైనా తిన్నారా.. ఒక్కసారి ట్రై చేస్తే?

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం కాస్త బీహార్ విద్య శాఖ అధికారి సంజయ్‌ కుమార్‌ దృష్టికి వెళ్ళింది. ఈ క్రమంలోనే ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలని విద్యాశాఖ అధికారి ఆదేశాలను జారీ చేశారు.బీహార్ ప్రభుత్వం విద్యాశాఖలో ఈ విధమైనటువంటి తప్పిదాలు చేయడం ఇదే మొదటిసారి కాదని ఇదివరకే ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులలో సన్నిలియోన్ టాపర్ గా ప్రకటించి నవ్వులపాలైన విషయాన్ని గుర్తు చేశారు.

Also read:పనస గింజలతో రోగనిరోధకశక్తి నిజంగా పెరుగుతుందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -