Monday, April 29, 2024
- Advertisement -

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. !

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తికి ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఈనెల 10వ తేదీ కి కర్ఫ్యూ ముగియనున్నది. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులతో సమావేశమయ్యారు. కర్ఫ్యూ పొడిగింపుపై చర్చించారు. అనంతరం ఆయన కర్ఫ్యూ ఈ నెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే అంతకు ముందు కర్ఫ్యూతో పోలిస్తే ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది.

ఇప్పటివరకు ఏపీలో ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సడలింపు ఉంది. 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అమల్లోకి రానున్న కర్ఫ్యూ లో ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న సడలింపును…ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ సడలింపు ఇచ్చింది.అలాగే ప్రభుత్వ కార్యాలయాల పని వేళలు కూడా మారుస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయనున్నాయి.

Also Read: నేటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ..!

గతంలో మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కార్యాలయాలు పని చేసేవి. దీన్ని మరో రెండుగంటల వరకు పొడిగించారు. దీంతోపాటు రాష్ట్రంలోకరోనా కేసుల తీవ్రత, వ్యాప్తి ఎలా ఉంది? తదితర విషయాలపై సీఎం జగన్ అధికారులతో చర్చించారు.
కోవిడ్​ బాధితులకు వైద్యం ఎలా అందుతోంది? తదితర వివరాలపై సీఎం జగన్​ ఆరా తీశారు. ఆరోగ్య శ్రీ అమలు తీరు తెన్నులపై కూడా సీఎం ఈ సమావేశంలో చర్చించారు.

Also Read: కోవాగ్జినా.. కోవిషీల్డా ఏది బెటర్​? ఇదిగో ఆన్సర్​

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -