Thursday, May 9, 2024
- Advertisement -

మహేష్ ని ఆకాశానికెత్తేసిన మురుగదాస్!

- Advertisement -

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్‌, పాపులర్ డైరెక్టర్స్‌లో ఒకరైన ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక సూపర్ స్టార్ మహేష్ తో పనిచేయడం పై మురుగదాస్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు.

మహేష్ తో పనిచేయడం చాలా అనందంగా ఉందని, మహేష్ చాలా అంకితభావంతో పనిచేస్తారని, సూపర్ స్టార్ అన్న పేరుకు తగ్గట్లే ఆయన నడుచుకుంటారని దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ అన్నారు. ఒక షాట్ కంప్లీట్ అవ్వగానే నన్ను చూస్తారు అని, నా ముఖంలో ఏమాత్రం అసంతృప్తి కనబడినట్లు అనిపించినా, వెంటనే ఇంకో టేక్‍కి వెళదాం అనేస్తారు అని, చెప్పే ప్రతీ విషయాన్నీ చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు చెప్పారు.

ఈ విధంగా మురుగదాస్ మహేష్ పై ప్రశంసలు కురిపించారు. ఓ సోషల్ మెసేజ్ ఉన్న కథతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ కథనాయిక గా నటిస్తోంది.

Related

  1. మెగాస్టార్ ను ఆకాశానికెత్తేసిన మహేష్ బాబు!
  2. పచ్చబొట్టు పొడిపించుకున్న మహేష్ భార్య
  3. కృష్ణ – మహేష్ – గౌతం – మనం లాంటి సినిమా ?
  4. ఈ అలవాటు మహేష్ కు ఉంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -