Friday, March 29, 2024
- Advertisement -

త్రివిక్రమ్ కి ఎందుకింత డిమాండ్..?

- Advertisement -

టాలీవుడ్ లో ప్రస్తుతం త్రివిక్రమ్ కి ఉన్న డిమాండ్ ఏ దర్శకుడికి లేదని చెప్పాలి. ఎందుకంటే ప్రతి హీరో ఈ దర్శకుడి కోసం పొతే పడుతున్నాడు.. ఒక్కసారి సినిమా చేసిన వాళ్ళు కూడా త్రివిక్రమ్ తో మళ్ళీ మళ్ళీ సినిమా చేయాలనుకుంటున్నారు అంటే హీరోలకు ఎంత ఫ్రీడమ్ ఇస్తాడో అర్థం చేసుకోవచ్చు.. పైగా హిట్ లు కూడా ఇస్తుండడంతో త్రివిక్రమ్ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. తన సినిమాల్లో చేసిన ఏ హీరో అయినా ఒక మెట్టు పైకి ఎక్కుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. స్టార్ డమ్ ని కూడా అమాంతం పెంచేలా చేస్తాడు త్రివిక్రమ్..

కొద్దీ సినిమాలతోనే టాప్ డైరెక్టర్ గా ఎదిగిన త్రివిక్రమ్ కి రచయితగా మంచి పేరుంది..  పవన్ తో భారీ ఫ్లాప్ సినిమా తర్వాత త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ తో చేసిన అరవింద సమేత మంచి హిట్ ని ఇచ్చింది.  ఆ తర్వాత అలవైకుంఠపురం సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.. అల్లు అర్జున్ కెరీర్ లో ఈ సినిమా టాప్ మోస్ట్ హిట్ గా నిలిచింది.. దాంతో త్రివిక్రమ్ తిరిగి తన పూర్వ వైభంగా కొనితెచ్చుకున్నాడు.. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా ని చేస్తున్న త్రివిక్రమ్ తదుపరి చిత్రం పై ఇప్పటినుంచే బజ్ క్రియేట్ అవుతుంది.. మహేష్ బాబు, రామ్ చరణ్ తేజ్ ఇద్దరిలో ఒకరితో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి..

ఫైనల్ గా మహేష్ బాబు తో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడని ఇటీవలే వార్తలు రాగ ఇప్పుడు త్రివిక్రమ్ తో చేయడానికి బన్నీ కూడా ఎదురుచూస్తున్నాడట..త్రివిక్రమ్ తో సినిమా చేస్తే యూత్‍ ప్లస్‍ ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ బాగా ఉండి సినిమా ఎంత పెద్ద హిట్టవుతుందనేది ‘అల వైకుంఠపురములో’ విషయంలో స్పష్టమయింది. త్రివిక్రమ్‍తో తన కాంబినేషన్‍ భేషుగ్గా వర్కవుట్‍ అవడంతో మరోసారి త్రివిక్రమ్‍ సినిమాను లైన్లో పెట్టాలని అల్లు అర్జున్‍ ఉవ్విళ్లూరుతున్నాడు. పుష్ప తర్వాత కొరటాల శివ సినిమా చేయబోతున్న అల్లు అర్జున్‍ ఆ వెంటనే త్రివిక్రమ్‍ సినిమా చేయాలని చూస్తున్నాడు. మరి త్రివిక్రమ్ మహేష్ రామ్ చరణ్ లతో ఫిక్స్ అయిపోయాడు.. మరి అల్లు అర్జున్ కోరిక ను ఎలా తీరుస్తాడా చూడాలి..

మళ్ళీ త్రివిక్రమ్ ఆమెనే తీసుకుంటున్నాడా..?

మహేష్ తో త్రివిక్రమ్ ఆల్మోస్ట్ ఓకే చేసినట్టే..?

మారుతీ భలే కాపీ కొట్టేశావే.. ఎవరికీ డౌట్ రాదనుకున్నావా..?

ఇసారి కూడా నాగార్జున ప్లేస్ లో రమ్యకృష్ణ..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -