Wednesday, April 24, 2024
- Advertisement -

బిగ్ బాస్‌లో నాగార్జున ప్లేస్ లో రమ్యకృష్ణ.. ఎందుకు ?

- Advertisement -

బిగ్ బాస్ నాలుగో సీజన్ మొదట్లో కాస్త తడబడిన.. తర్వాత మంచి ఊపు అందుకుని రసవత్తరంగా సాగుతోంది. ఈ షోకి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హోస్ట్ మారుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమనడం జనాల్లో హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ హోస్ట్ స్థానలో నాగ్ కు బదులుగా మరొక సెలబ్రిటీ కనిపించబోతున్నారని తెలుస్తోంది.

నాగ్ నటిస్తున్న ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ కోసం థాయ్‌లాండ్ వెళ్లిన నాగార్జున ఇంకా తిరిగి రాలేదని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఇంకా కొన్ని వారాల పాటు అక్కడ షూట్ చేయాల్సి ఉందట. దాంతో నాగార్జునను డిస్టర్బ్ చేయకుండా కొన్ని ఎపిసోడ్స్‌లో ఆయన బదులుగా వేరొకరిని తీసుకోవాలని ప్లాన్ చేసిందట బిగ్ బాస్ యాజమాన్యం. ఇందుకోసం ముందుగా ఎన్టీఆర్, నానిలతో పాటు నాగచైతన్యను కూడా సంప్రదించగా.. వారంతా తమ తమ సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నామని చెప్పారట.

దీంతో రమ్యకృష్ణ వద్దకు ఆ ఆఫర్ వెళ్లిందని టాక్. గత సీజన్ లో కూడా నాగ్ అందుబాటులో లేనప్పుడూ హోస్ట్‌గా రమ్యకృష్ణ చేసింది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ యాజమాన్యం తీసుకొచ్చిన ప్రపోజల్‌పై ఆమె కూడా సానుకూలంగా స్పందించి ఓకే చెప్పిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ వారం నుంచే బిగ్ బాస్ హౌస్ బాధ్యతలు రమ్యకృష్ణ చేతిలో పెట్టారని తెలుస్తోంది. ఇంకోవైపు నాగార్జున స్పెషల్ విమానంలో బిగ్ బాస్ షూట్ కు వస్తారని అంటున్నారు. మరి ఈ వారం హోస్ట్ గా ఎవరు చేస్తారో చూడాలి.

గంగవ్వ కి చిరంజీవి భరోసా.. ఏంటి ఈ కథ ?

ఆర్తి అగర్వాల్‌ చనిపోవడానికి కారణం ఎవరో తెలుసా ?

పవన్ కళ్యాణ్ కేజిఎఫ్ తో తట్టుకుని నిలబడ గలడా..?

త్రివిక్రమ్ వల్ల మహేష్ , చరణ్ ల మధ్య గ్యాప్ పెరగనుందా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -