సినీ పరిశ్రమలో ఎవరి సపోర్ట్ లేకుండా.. వచ్చి.. తక్కువ కాలంలో మంచి హీరో అయ్యాడు ఉదయ్ కిరణ్. ఎంత తొందరగా.. స్టార్ హీరో అయ్యాడు.. అంతే తొందరగా తెరమరుగైపోయాడు. ఒకానిక సమయంలో యూత్ లో ఉదయ్ కిరణ్ మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు.
కెరీర్ మంచి స్టేజ్ లో ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇంటి అల్లుడయ్యే ఛాన్సు వచ్చింది. చిరు కుమార్తె సుస్మితతో ఎంగెజ్మేంట్ కూడా అయ్యాక పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఉదయ్ కిరణ్ అతి పెద్ద తప్పిదం ఇదేనని సినిమా లవర్స్ అంటూ ఉంటారు. ఈ పెళ్లి క్యాన్సిల్ కావాడానికి కారణం.. ఉదయ్ కిరణ్ కెరీర్ స్పాయిల్ అవ్వాడానికి కారణం చిరంజీవే అని కొంత మంది అంటూ ఉంటారు. సుస్మితతో పెళ్లి రద్దుకు అసలు కారణం ఉదయ్ కిరణ్ దేనని.. మెగాస్టార్ ది కానేకాదని ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి అన్నారు. కొంతకాలంగా ఫ్యామిలీతో కలిసి మస్కట్ లో ఉంటున్న ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్న మూడేళ్ల తర్వాత ఈ విషయంలో పెదవి విప్పారు. ‘‘సుస్మితతో ఎంగేజ్ మెంట్ జరగక ముందు నుంచే ఉదయ్ కిరణ్ కు చిరంజీవి ఎంతో సపోర్ట్ నిచ్చారు. అతడు కష్టకాలంలో ఉన్నప్పుడు (లేడీ జర్నలిస్ట్ తో బ్రేకప్ అయిన సమయంలో) చిరంజీవిగారు ఎంతో అండగా నిలిచారు. తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయడానికి రెడీ అయ్యారు. మేము ఒకసారి ఆయన ఇంటికి వెళ్లాం.
వారి ఆతిథ్యం అద్భుతమనే చెప్పాలి. కానీ ఎందుకో సుస్మితతో తనకు సరిపడదని ఉదయ్ భావించాడు. తనతో సర్ధుకుపోగలనని అనుకోలేకపోయాడు. దాంతో పెళ్లి రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడని. ఈ నిర్ణయం పూర్తిగా ఉదయ్ కిరణ్ దే అని.. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ చిరంజీవి ఫ్యామిలీతో టచ్ లోనే లేడు’ అంటూ శ్రీదేవి తెలిపారు. ఆ తర్వాత విషితతో ఉదయ్ పెళ్లి జరిగింది. ఎందుకో వాళ్లిద్దరూ హ్యాపిగా ఉండలేకపోయారు. ఉదయ్ పెళ్లి తర్వాత నేను మస్కట్ వెళ్లిపోయా. ఎప్పుడైనా ఫోన్ చేసినా మా తమ్ముడే మాట్లాడేవాడు తప్ప విషిత ఇంట్లో ఉన్నా ఎప్పుడు మాట్లాడలేదు. ఉదయ్ మరణం తర్వాత కూడా విషిత మాతో మాట్లాడలేదు. ఎందుకిలా జరిగిందో చెప్పలేదని ఉదయ్ అక్క శ్రీదేవి తన ఆవేదన పంచుకున్నారు. ఏది ఏమైన మంచి హీరోగా వెలిగిపోవాల్సిన తార అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకోవడం.. అత్యంత విషాదాంశం.
{youtube}ELtsSrJfCB4{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related
