Thursday, May 2, 2024
- Advertisement -

ఎస్పీబీ విషయంలో చంద్రబాబు ఇంత చీప్ గా చేశాడేంటి..?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రతి పక్ష నేత చంద్రబాబు కు రాజకీయాల్లో నే కాదు సినీ రంగంలోనూ మంచి పట్టుంది.. అక్కడి వారితో ఆయనకు మంచి సంబంధాలు కూడా ఉన్నాయి.. సినీ ప్రముఖుల్లో ఎవరికైనా ఏం జరిగినా చంద్రబాబు వారిని పరామర్శించడంలో ముందుంటారు. తన కుటుంబలో సినీ ఇండస్ట్రీ లో ఉన్నందువలన ఆయనకు సినీ ఇండస్ట్రీ తో కొన్ని సంబంధాలు ఏర్పడగా తాజాగా అయన జగన్ కు విజ్ఞప్తి చేసిన ఓ విషయం అందరికి తెగ ఆశ్చర్యం కలిగిస్తుంది.. చంద్రబాబు వంటి నేత ఇంత చిన్న డిమాండ్ చేయడం కొంత అసహనాన్ని కలిగిస్తుంది.. ఇటీవలే గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం మరణించిన సంగతి తెలిసిందే..

ఆయనకు అందరు ఘన నివాళులు అర్పించగా అయన అంతిమ యాత్ర సినీ ప్రముఖులందరి సమక్షంలో జరిగింది.. అయితే చంద్రబాబు బాలసుబ్రహ్మణ్యం కోసం ఓ విశ్వా విద్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ లో నిర్మించాలని జగన్ ను డిమాండ్ చేయడం పట్ల అందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.. బాలు లాంటి మహా గాయకుడికి ఇంత చిన్న కోరిక నా కోరడం.. రాష్ట్రం మొత్తం అయన కు భారత రత్న  ఇవ్వాలని కేంద్రాన్ని ఒత్తిడి చేస్తుండగా చంద్రబాబు జగన్ ను ఇలా చిన్న చిన్న కోరికలు కోరడం విడ్డురంగా వుంది అంటున్నారు..

ఇది పూర్తిగా అవ‌గాహ‌న రాహిత్యం. ల‌తామంగేష్కర్ ఇంకా జీవించి ఉన్నారు. ఆమెకు భార‌త ర‌త్న ఇచ్చారు. అదేవిధంగా సచిన్ టెండూల్కర్‌కు కూడా భార‌తర‌త్న ఇచ్చారు. ఇలా జీవించి ఉన్నవారికి కూడా ద‌క్కాయి. అదేవిధంగా ఎస్పీబాలుకు కూడా జీవించి ఉన్న స‌మయంలో ఈ అవార్డు ద‌క్కాలని ఒక‌ప్పుడు సంగీత అభిమానుల నుంచి డిమాండ్ వ‌చ్చింది. ఎన్నో భాష‌ల్లో ఏకంగా 40 వేల పైచిలుకు పాట‌లు పాడ‌డం అంటే మామూలు విష‌యం కాదు. అయితే, దీనిని ఎవ‌రూ ఢిల్లీ వ‌ర‌కు తీసుకువెళ్లలేక‌పోయారు. ఇక‌, ఇప్పుడు చంద్రబాబువంటి నాయ‌కులు బాలు విష‌యంలో భార‌త ర‌త్న కోర‌క‌పోవ‌డం కూడా ఇలాంటిదే.బాలుకు భార‌త ర‌త్న ఇవ్వాల‌ని కోరుతూ.. కేంద్రానికి లేఖ రాయ‌డాన్ని సంగీతాభిమానులు స్వాగ‌తిస్తున్నారు. సీఎం జ‌గ‌న్‌కు రాజ‌కీయంగానే కాకుండా అన్ని విధాలా ప్లస్ అయ్యింది. కేంద్రం ఇప్పటికైనా ఈ విష‌యంలో రాజ‌కీయాలు వ‌దిలి.. బాలుకు భార‌త ర‌త్న ఇస్తే.. ఈ దేశ‌మే గ‌ర్విస్తుంద‌ని చెప్పక‌త‌ప్పదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -