మెగా కాంపౌండ్ నుంచి తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన మరో హీరో పంజా వైష్ణవ్ తేజ్. మెగా బ్రదర్్స మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు అయిన వైశూ తొలి సినిమా ఉప్పెనతోనే తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. డేరింగ్ క్లైమాక్సుతో రిస్్క చేశాడు. ఇక సినిమాకు ముందే నీకన్ను నీలి సముద్రం, ధక్‌ధక్ పాటలతో బాగా హైప్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే.
ఇక క్రుతి శెట్టి- వైష్ణవ్ తేజ్ ఫ్రెష్ పెయిర్ అభిమానులను ఆకట్టుకోవడంతో వసూళ్లపరంగా కూడా ఈ సినిమా తొలి రోజే రికార్డు స్రుష్టించింది. అన్నిచోట్ల కలిపి దాదాపు 10 కోట్లు వసూలు చేసింది. ఇదే ఉత్సాహంలో ప్రమోషన్ కార్యక్రమాలు మరింత ముమ్మరం చేసింది మూవీ యూనిట్.
మెగా కజిన్్స వరుణ్ తేజ్, నిహారిక కొణిదెల జొన్నలగడ్డ, సాయిధరమ్ తేజ్, ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్‌తో కలిసి ఇంటర్వ్యూ ప్లాన్ చేసింది మైత్రీ మూవీ మేకర్్స. ఇందుకు సంబంధించిన టీజర్‌ను తాజాగా యూట్యూబ్లో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్‌సేతుపతి కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
ప్రభావవంతమైన భారతీయుల్లో టాప్ లేపిన అల్లు అర్జున్
దుమ్మురేపుతున్న ‘ఉప్పెన’ఫస్ట్ డే కలెక్షన్లు!
నేనే నిర్మాత అయితే ‘ఉప్పెన’చేసేవాడిని కాదు