Tuesday, May 14, 2024
- Advertisement -

హీరోగా సాయిధరమ్‌ తమ్ముడు..

- Advertisement -
Vaishnav Tej bro Sai Dharam Tej New Hero From Mega Family

మెగా కుటుంబం నుంచి మరో యంగ్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలుగా వచ్చారు. అయితే ఇప్పుడు మరో హీరో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టనున్నాడు. అతని పేరు వైష్ణవ్ తేజ్. ఈయన ఎవరో కాదు.. సాయిధరమ్ తేజ్ స్వయనా తమ్ముడు. ఇతను త్వరలోనే హీరో అవతారం ఎత్తేస్తాడని, ప్రస్తుతానికి యాక్టింగ్‌ క్లాస్‌లకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడని తెలుస్తోంది.

వాస్తవానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజను మంది హీరోలు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, సాయిధరమ్‌, వరుణ్‌ తేజ్‌, అల్లు శిరీష్‌లు ఉన్నారు. ఈ జాబితాలో వైష్ణవ్ తేజ్ చేరనున్నాడు. ఇప్పటికిప్పుడే కాకపోయినా భవిష్యత్తులోనైనా అతను హీరోగా మారడం ఖాయమని మెగా ఫ్యామిలీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఓ ఇంటర్వ్యూలో వైష్ణవ్‌ గురించి సాయిధరమ్‌కు ప్రశ్న ఎదురైంది. దానికి సాయిధరమ్‌ స్పందిస్తూ..  ‘ప్రస్తుతం మా తమ్ముడు చదువులో బిజీగా ఉన్నాడు. ఇప్పుడే యాక్టింగ్‌ ఏంటి’ అని సమాధానమిచ్చాడు. ఇంతకుముందు వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ గురించి కూడా ఇలాగే సమాధానం వచ్చేది. ఆ తర్వాత వాళ్లు ఎంతో కష్టపడి హీరోలైపోయారు. ఇప్పుడు వైష్ణవ్‌ కూడా అదే రూట్‌లో ఉన్నాడట. 

Related

  1. ప్రభాస్ తో గొడవపడ్డ స్టార్ హీరోయిన్
  2. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
  3. రెస్టారెంట్ ద్వారా హీరో నితిన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..!!
  4. వెండితెర ఎంట్రీ ఇవ్వనున్న హీరో తరుణ్ చెల్లెల్ని చూశారా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -