Friday, April 19, 2024
- Advertisement -

మెగా చిన్నోడికి మరో బంపర్​ ఆఫర్​..!

- Advertisement -

ఉప్పెన విజయంతో వైష్ణవ్​ తేజ్​ రేంజ్​ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద భారీ హిట్​ కావడంతో పాటు.. వైష్ణవ్​కు నటన పరంగా మంచి మార్కులు తీసుకొచ్చింది. ఈ చిత్రంలో నటించిన కృతి శెట్టికి కూడా మంచి పేరు వచ్చింది. దీంతో వైష్ణవ్​కు పెద్ద పెద్ద బ్యానర్​ల నుంచి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం అన్నపూర్ణ బ్యానర్​లో ఓ చిత్రంలో నటిస్తున్నాడు వైష్ణవ్​. ఈ చిత్రానికి దశరథ్​ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇదిలా ఉంటే వైష్ణవ్​ తేజ్​ .. ఆ తర్వాత సురేందర్​రెడ్డి డైరెక్షన్​లో నటించబోతున్నట్టు టాక్​. ఈ మేరకు ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయట. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు.. త్వరలో అధికారికంగా బయటకు వచ్చే చాన్స్​ ఉంది. ఇక ప్రస్తుతం సురేందర్​రెడ్డి.. అక్కినేని అఖిల్​తో ఏజెంట్​ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన అఖిల్ లుక్​ ఆకట్టుకుంటున్నది.

Also Read: పవన్​ కల్యాణ్​, రానా దగ్గుపాటి సినిమా టైటిల్​ ఇదేనా?

వరుస ప్లాప్​లతో అఖిల్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. తన కెరీర్​లో ఇంత వరకు ఒక్క హిట్​ మూవీ కూడా పడలేదు. కనీసం యావరేజ్​ మూవీ కూడా లేదు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని సురేందర్​రెడ్డి.. ఓ విభిన్నమైన కథను సిద్ధం చేసినట్టు టాక్​. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.. ఇది పూర్తయిన తర్వాత వైష్ణవ్​తేజ్​తో సురేందర్​ రెడ్డి మూవీ ప్రారంభం అయ్యే అవకాశం చాన్స్​ ఉంది.

Also Read: బాలీవుడ్​కు సత్యదేవ్​.. నువ్వు గ్రేట్​ బ్రో

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -