‘పుష్ప’ ఆఖరి షెడ్యూల్​ ప్రారంభం..!

స్టైలిష్​ స్టార్​ అల్లు అర్జున్​.. క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్​ దర్శకత్వంలో పుష్ప సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ భారీ బడ్జెట్​తో తెరకెక్కుతోంది. పాన్​ఇండియా మూవీగా తీసుకొస్తున్నారు. అంతేకాక రెండు పార్ట్​లుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్​ సరసన రష్మిక నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్​ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతున్నట్టు టాక్​. మొత్తానికి ఈ సినిమాపై విపరీతమైన హైప్​ క్రియేట్​ అయ్యింది. ఈ సినిమా టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది.

ఇదిలా ఉంటే లాక్​డౌన్​తో ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. నిన్నటి నుంచి హైదరాబాద్​లో చివరి షెడ్యూల్​ ప్రారంభించారు. ఈ షెడ్యూల్ లో దాదాపు 45 రోజులు నిరంతరాయంగా షూటింగ్ జరుపుతారట. దీంతో ఈ మూవీ మొదటి పార్ట్​ షూటింగ్ పూర్తవుతుంది.ఆ తర్వాత పోస్ట్​ ప్రొడక్షన్ పనులు ముగించుకొని పాన్​ ఇండియా లెవెల్​లో భారీగా విడుదల చేసేందుకు ప్లాన్​ చేస్తున్నారు.

Also Read: వనితా వర్సెస్​ రమ్యకృష్ణ.. ఏమిటీ పంచాయితీ?

అయితే ఈ సినిమా విడుదల పై క్లారిటీ లేదు. దసరాకు ముందు ఆచార్య వస్తుండగా, అక్టోబర్ 13 దసరా కానుకగా ఆర్ఆర్ఆర్ రానున్నది. ఆ తర్వాత వినాయక చవితికి అఖండ విడుదల అవుతుంది. దీంతో పుష్ప విడుదల ఎప్పుడు అనేది క్లారిటీ రావడం లేదు. కాగా పుష్పలో అల్లు అర్జున్ చెల్లెలిగా ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. ఈ సినిమాతో తెలుగు తెరకి మాలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ పరిచయమవుతున్నాడు.కరోనా ఎఫెక్ట్​తో ఇప్పటికే పలు భారీ బడ్జెట్ చిత్రాల షూటింగ్​ మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. ఆచార్య షూటింగ్​ కూడా ఇవాళ షూటింగ్ ప్రారంమైంది.

Also Read: అమీర్​.. కిరణ్ రావు విడిపోవడానికి కారణం ఆమె నా..?

Related Articles

Most Populer

Recent Posts