Monday, April 29, 2024
- Advertisement -

రేవంత్ రెడ్డిలో మార్పు వస్తోందా.. మునుగోడు ఎఫెక్టేనా ?

- Advertisement -

మునుగోడు ఎన్నికల ఫలితం కాంగ్రెస్ లో మార్పు తీసుకొచ్చిందా ? రేవంత్ రెడ్డి తన వైఖరిలో మార్పు కనబరుస్తున్నారా ? అంటే అవుననే సమాధానమే గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే గతంలో మునుగోడు.. కాంగ్రెస్ కంచుకోటగా బలమైన ఓటు బ్యాంక్ కల్గి ఉండేది. అక్కడ గతంలో ఆరు సార్లు కాంగ్రెస్ జెండా ఎగిరిందంటే ఆ పార్టీకి ఎంత బలమైన ఓటు ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి మునుగోడు నియోజిక వర్గంలో ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కలలో కూడా ఊహించని ఓటమిని చవి చూసింది. కనీసం డిపాజిట్ కూడా అక్కడ దక్కించుకోలేపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత దారుణమైన ఓటమిని బహుశా కాంగ్రెస్ అస్సలు ఊహించి ఉండదు..

ఇక ఈ ఓటమితో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో చాలానే మార్పు వచ్చిందనే వాదన వినిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య ఎజెండా అధికంగా ఉండేది. రేవంత్ రెడ్డి పిసిసిఐ చైర్మెన్ అయినప్పుడు.. ఆ పార్టీ సీనియర్ నేతలంతా మూకుమ్మడిగా వ్యతిరేకత కనబరిచారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిర్రెడ్డి రాజగోపాల్ రెడ్డి ( పార్టీలో ఉన్నప్పుడూ ), జగ్గారెడ్డి.. ఇలా పార్టీ సీనియర్ నేతలంతా రేవంత్ ను తమ నాయకుడిగా అంగీకరించేందుకు ఏ మాత్రం మొగ్గు చూపలేదు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు మీకు మీరే మాకు మేమే అన్నట్లుగా సాగాయి. పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు.. రేవంత్ రెడ్డి ఒక్కరే తీసుకునేవారని.. నేతలతో చర్చించే వారు కాదని బహిరంగంగానే విమర్శలు గుప్పించారు ఆయా నేతలు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీలోని రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్ వంటి వారు ఇతర పార్టీల గూటికి చేరారు.

ఇంకా కొంత మంది నేతలు కూడా పార్టీ వీడే అవకాశం ఉందంటూ వార్తలు గట్టిగానే వినిపించాయి. ఇక మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో రేవంత్ రెడ్డి వర్సస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్య జరిగిన కోల్డ్ వార్ కూడా కాంగ్రెస్ ఓటమికి ఒక కారణం అనే చెప్పుకోవచ్చు. దాంతో బైపోల్ ఫలితం పార్టీని కుదేలు చేయడంతో రేవంత్ రెడ్డి తన వైఖరిని మార్చుకొని అందరినీ కొలుపుకునే ప్రయత్నం చేస్తున్నాడట. ఆ మద్య తెలంగాణలో జరిగిన జోడో యాత్రలో కూడా రాహుల్ గాంధీ.. అందరూ కలిసి కట్టుగా పార్టీ కొరకు పని చేయాలని రేవంత్ రెడ్డికి సూచించరాట. దాంతో నేతలందరిని ఒక్కతాటి పైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారట రేవంత్ రెడ్డి. అందువల్ల గతంలో రేవంత్ రెడ్డిని విమర్శించే జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వి హనుమంతరావు వంటి వారు ప్రస్తుతం సైలెంట్ అయ్యారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందరినీ కలుపుకొకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి చవి చూడడం ఖాయమనే సంకేతాలు కనిపించడంతో.. ఐకమత్యమే మహా బలం అనే సూత్రాన్ని పాటిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి మునుగోడు ఎఫెక్ట్ రేవంత్ రెడ్డిలో చాలానే మార్పు తీసుకొచ్చిందనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి

బీజేపీకి షాక్ ఇచ్చిన హైకోర్టు.. అసలు ఊహించలేదా ?

ఈటెల మళ్ళీ టి‌ఆర్‌ఎస్ లోకి.. బిజెపికి గట్టి దెబ్బే ?

ఎల్లలు దాటుతున్న మోడీ మేనియా !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -