Friday, April 19, 2024
- Advertisement -

నా ఫేవరెట్ హీరోయిన్ నయనతార కాదు: విగ్నేష్ శివన్

- Advertisement -

కోలీవుడ్ లవ్ బర్డ్స్ గా ఎంతో పాపులరైన జంటలలో విగ్నేష్ శివన్ -నయనతార జంట ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ఈ జంట గురించి నెటిజన్లకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? శివన్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నయన్ కి విగ్నేష్ ఇచ్చిన మొదటి బహుమతి ఏంటి అనే సమాధానాలకు తాజాగా శివన్ సమాధానాలను తెలియజేశారు.

వృత్తిపరంగా దర్శకుడైన శివన్ గురించి కాకుండా చాలామంది నయనతార గురించి మాట్లాడటంతో తనకు ఏమాత్రం అసూయ లేదని ఆ విధంగా నయనతార గురించి ఎక్కువగా మాట్లాడటం చాలా గర్వంగా ఉందని తెలిపారు. అదేవిధంగా నయనతార ఎంతో అందంగా ఉన్నప్పటికీ తను నా ఫేవరెట్ హీరోయిన్ కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలిపారు. శివన్ ఫేవరెట్ హీరోయిన్ మోనికా బెల్లూచి అని ఈ సందర్భంగా విగ్నేష్ తెలిపారు.

Also read:ప్రమాదంలో ఎడమ కన్ను చూపు కోల్పోయిన కత్తి మహేష్?

నయనతారతో కలసి సిల్వర్ స్క్రీన్ పంచుకోవాలనేది తన కోరిక అని, నయనతార నటించిన సినిమా “నానుమ్‌ రౌడీదాన్‌” లోని ‘తంగమే’ (బంగారమే…) అనే పాటకు లిరిక్స్‌ రాశాను. ఆమెకు నేను ఇచ్చిన తొలి బహుమతి ఈ పాట అని విగ్నేష్ తెలిపారు. అదేవిధంగా నయనతార చీరకట్టులో ఉంటే తనకెంతో నచ్చుతుందని తెలిపారు.ఇక పెళ్ళి విషయానికి వస్తే పెళ్లి అంటే చాలా ఖర్చు అవుతుంది కనుక పెళ్లి కోసం డబ్బులను కూడా పెడుతున్నాం. కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తరువాత ఎంతో ఘనంగా వివాహం చేసుకోబోతున్నామని ఈ సందర్భంగా విగ్నేష్ తెలిపారు.

Also read:రసవత్తరంగా మారిన “మా” ఎన్నికలు.. బరిలోకి ఓ. కళ్యాణ్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -