Friday, May 3, 2024
- Advertisement -

ఫోర్జరీ కేసులో మహాత్ముడి ముని మనవరాలికి ఏడేళ్ల జైలు శిక్ష..!

- Advertisement -

మహాత్ములు, గొప్పవాళ్ల పిల్లలు వాళ్లలాగే కీర్తి, ప్రతిష్ఠలు తెచ్చుకోవాలన్న రూల్​ ఏమీ లేదు. నేరస్థులు కూడా కావచ్చు. మనం ఎరిగిన, మనకు చాలా ఇష్టమైన, గొప్పవ్యక్తుల వ్యక్తుల పిల్లలు లేదా వాళ్ల సంతతి నేరస్థులు అయితే జాలిపడటం తప్ప ఏమీ చేయలేము. నేరస్థుల పిల్లలు గొప్పవాళ్లు అయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే చాలా గొప్పవాళ్ల పిల్లలు నేరస్థులుగా మారిన ఘటనలు కోకొల్లులు. మనదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ.. ముని మనవరాలు మోసం, ఫోర్జరీ కేసులో ఇరుక్కున్నది. దక్షిణాఫ్రికాలోని కోర్టు ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. ఈ విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
మహాత్మా గాంధీ ముని మనవరాలు ఆశిష్ లతా రామ్‌గోబిన్ కు ద‌క్షిణాఫ్రికాలోని డ‌ర్బ‌న్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆశిష్ లతా రామ్‌గోబిన్ వయసు 56 ఏళ్లు. ఆమె తల్లి ప్రముఖ మానవహక్కుల కార్యకర్త లతా రాంబోగిన్​. ఇదిలా ఉంటే అహింసకు వ్యతిరేకంగా దక్షిణాఫ్రికాలో ఏర్పాటైన ఓ సంస్థకు ఆశిష్ లతా రామ్‌గోబిన్ డైరెక్టర్​గా పనిచేస్తున్నారు. అయితే ఆమె అక్కడి వ్యాపారవేత్త మహరాజ్‌ను మోసం చేశారు. ఈ మేరకు అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో కోర్టు శిక్ష విధించింది.

Also Read: ‘స్పీడ్ పోస్ట్’లో అస్థికలు పంపించండి.. గంగలో కలుపుతాం.. !

ఈ కేసు ఏమిటి? ఆమె ఎలా మోసం చేసిందో తెలుసుకుందాం..
ఆశిష్ లతా రామ్‌గోబిన్ ఓ పర్యావరణ కార్యకర్తగానూ పనిచేస్తున్నారు. 2015లో ఆమెకు ప్రముఖ వ్యాపార వేత్త పుట్‌వేర్ డిస్ట్రిబ్యూట‌ర్ కంపెనీ డైరెక్ట‌ర్ ఎస్ఆర్ మ‌హరాజ్‌ .. పరిచయం అయ్యారు. రామ్​గోబిన్​ గాంధీ తాలుకూ పనిషి కావడంతో.. మహారాజ్​ ఆమెతో స్నేహం చేశాడు. ఓ రోజు రామ్​ గోబిన్​.. మహారాజ్​కు ఫోన్​ చేసింది. తాను భారత్​ నుంచి లివెన్​ వస్త్రాలతో ఉన్న మూడు కంటెయినర్లు దిగుమతి చేసుకున్నానని.. కానీ కస్టమ్స్​ సుంకం చెల్లించేందుకు తన దగ్గర డబ్బులు లేవని మహారాజ్​కు చెప్పింది. లినెన్ ఉత్ప‌త్తుల‌ను ఆర్డ‌ర్ చేసిన‌ట్లుగా కొన్ని ప‌త్రాలు, ఇన్‌వాయిస్‌లు ఫ్రూఫ్ లుగా ఆమె చూపించారు.

తనకు 6.2 మిలియన్ రాండ్ల న‌గ‌దు (రూ.3.23 కోట్లు) అవసరమని చెప్పారు. ఈ డబ్బు ఇస్తే.. వచ్చే వస్తువుల్లో వాటా ఇస్తానని మహారాజ్​తో ఆమె ఒప్పందం చేసుకున్నారు. దీంతో ఆయన ఒప్పుకొని అడిగినంతా డబ్బు ఇచ్చాడు. కానీ అసలు విషయం ఏమిటంటే.. ఆమె ఎటువంటి వస్తువులను ఇండియా నుంచి దిగుమతి చేసుకోలేదు. తన వాటా ఏది? అని మహారాజ్​ ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. దీంతో మహారాజ్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన పోలీసులు ఆమె 2015లో అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె బెయిల్ మీద బయటకు వచ్చింది. ప్రస్తుతం కోర్టులో విచారణ ముగిసింది. ఆమెకు ఏడేళ్ల జైలుశిక్ష పడింది.

Also Read: మీకు తెలుసా.. సిపాయిల తిరుగుబాటు కంటే ముందే బ్రిటిష్ ని వణికించిన ఉద్యమం మరొకటుందని..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -