Saturday, April 27, 2024
- Advertisement -

ఎవరైనా పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ ఉంది : పవన్ కళ్యాన్

- Advertisement -

వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పార్టీ పెట్టడం ఖాయమైంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని ఆమె ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమె పార్టీ పేరు వైఎస్‌‌ఆర్‌టీపీ అని ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె పార్టీ పెట్టడం పై పలువురు సీనియర్ నేతలు భిన్నాభిప్రాయాలు వెల్లుబుచ్చారు. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ స్పందించారు. ఎవరైనా  పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ ఉందని..షర్మిలా పార్టీ విధివిధానాలు పెట్టాక స్పందిస్తానన్నారు. 

తెలంగాణలో షర్మిల పార్టీ రావాలనే తాను కోరుకుంటున్నానని అన్నారు. కాగా, ఏపీ రాజకీయాలు, స్థానికంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, శాంతి భద్రత పరిస్థితులు, దేవాలయాలపై దాడులు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి కేంద్రహోంమంత్రి అమిత్ షా తో చర్చించామన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ని నమ్ముకొని ఎంతో మంది ఆధారపడి ఉన్నారని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా 18 వేల మంది ప్రత్యక్ష ఉపాధి, 20 వేల మంది కాంట్రాక్ట్ సిబ్బంది, మొత్తంగా లక్ష మంది ఉపాధి పొందుతున్నారన్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై స్పందించాలన్న ప్రశ్నకు హైదరాబాదులో ఉన్నప్పుడే కేసీఆర్ పాలన గురించి తాను మాట్లాడతానని చెప్పారు.

రెండో పెళ్ళి చేసుకున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..!

త్వరలో కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి..!

ఇప్పుడు షర్మిల వచ్చింది… రేపు జూనియర్ ఎన్టీఆర్..!

డైరెక్టర్ కాకముందు సుకుమార్ జీతం తెలిస్తే షాక్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -