Saturday, April 27, 2024
- Advertisement -

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… ప్ర‌యివేటుకు ఇసుక తవ్వకాలు

- Advertisement -

ఆ మ‌ధ్య కాలంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇసుక రాజ‌కీయాలు ఓ రేంజ్‌లో న‌డిచాయి. ఇప్ప‌టికీ దీనికి సంబంధించిన రాజ‌కీయ రాద్దాంతం కొన‌సాగుతూనే ఉంది. దీనికి కార‌ణం లేక‌పోలేదు. అధికారుల‌పైనే ప‌లు చోట్ల ఇసుక మాఫియా దాడుల‌కు తెగ‌బ‌డుతూ వారి ప్రాణాలను హ‌రించిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఇసుక మైనింగ్ సంబంధించి సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇసుక రీచ్ ల్లో తవ్వకాల బాధ్యతలను ఓ ప్ర‌యివేటు కంపెనీకి అప్ప‌గించింది. ఈ ఇసుకు మైనింగ్కు సంబంధించిన త‌వ్వ‌కాల‌తో పాటు ఇసుక అమ్మ‌కాల బాధ్య‌త‌ను ప్ర‌యివేటు సంస్థ అయిన మెస్సర్స్ జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ ద‌క్కించుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా వున్న ఇసుక రీచ్ లను మూడు ప్యాకేజీలుగా విభజించిన ఎంఎస్ టీసీ ఆ మేరకు వేలం నిర్వహించింది. దీనిలో రెండేళ్ల కాలవ్యవధి సంబంధించి ఇసుక తవ్వకాలకు, అమ్మ‌కాల‌కు బిడ్డింగ్ నిర్వ‌హించారు. ఈ బిడ్డింగ్‌లో మూడు ప్యాకేజీలను జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ కైవసం చేసుకుంది. దీని కార‌ణంగా ప్ర‌భుత్వానికి రూ.765 కోట్ల ఆదాయం రానుందని అధికారులు వెల్ల‌డించారు.

వామ్మో ఎక్కువ నిద్రపోతే అంతేనట !

మందుకొడితే.. ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతారో తెలుసా ?

శృతిహాస‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం !

ఇటలీలో అన‌సూయ హ‌ల్‌చ‌ల్ !

బాబోయ్ మాకొద్దీ వర్క్ ఫ్రమ్ హోం..

‘శాకుంతలం’లో మోహన్ బాబు కీలక పాత్ర?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -