Thursday, April 25, 2024
- Advertisement -

తెలంగాణలో లాక్ డౌన్ పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకుంటారా?

- Advertisement -

భారతదేశంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అధికంగా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తుండడంతో కఠిన ఆంక్షలు నమోదు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించాయి. ఢిల్లీ, యూపీ, ఇతర రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగిస్తూ..నిర్ణయం తీసుకున్నాయి. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ మాత్రం కొనసాగుతోంది. ఏపీలో మాత్రం మధ్యాహ్నం కర్ఫ్యూ విధించింది సీఎం జగన్ ప్రభుత్వం.

తెలంగాణలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. పాజిటివ్ కేసులు పెరుగుతుండడం, మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంటుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2021, మే 11వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 02 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే లాక్‌డౌన్ విధించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తుండటంతో పాటు వీకెండ్ లాక్‌డౌన్‌ విధించాలని హైకోర్టు డెడ్ లైన్ విధించింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి.

ఈ క్రమంలో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో లాక్‌డౌన్ పెట్టేది లేదని ఇప్పటికే కేసీఆర్ పలుమార్లు బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో పాక్షిక లాక్‌డౌన్, మినీ లాక్‌డౌన్ లాంటిది ఏమైనా విధిస్తారా అనేది చూడాలి.

విజయ్ రెమ్యూనరేషన్ వింటే షాక్?

తప్పు నాది.. మా కుటుంబాన్ని ఎందుకు లాగింది? శ్రీరెడ్డిపై అభిరామ్ ఫైర్!

ఆర్ఆర్ఆర్ ఆపండి.. మహేష్ తో సినిమా మొదలెట్టండి అంటూ రాజమౌళిపై ఒత్తిడి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -