బిచ్చగాడు సినిమాతో రాత్రికి రాత్రి అతిపెద్ద స్టార్ అయిపోయాడు విజయ్ ఆంటోనీ. స్వతహాగా మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఈయన హీరోగా మొదలు పెట్టి నెమ్మది నెమ్మదిగా మంచి స్థాయికి ఎదిగాడు. అద్భుతమైన కథలు ఎంచుకుంటూ తానే ప్రొడ్యూసర్ గా మారి ఆ సినిమాలు తీష్టున్నాడు విజయ్.
అతని సినిమా బిచ్చగాడు ఎంత పెద్ద సంచలనమో అందరికీ తెలిసిందే. సర్దార్ గబ్బర్ సింగ్ , బ్రహ్మోత్సవం లాంటి పెద్ద సినిమాలు వచ్చిన టైం లో వచ్చిన బిచ్చగాడు చాలా పెద్ద హిట్ అయ్యి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా కేవలం తెలుగు మార్కెట్ లో ఇరవై ఐదు కోట్లు వసూలు చేసింది అంటే చాలా పెద్ద విశేషం.
ఇప్పుడు అదే హీరో కొత్త సినిమాతో రాబోతున్నాడు, తమిళం లో సైతాన్ అనే టైటిల్ పెట్టిన ఈ సినిమా తెలుగు లో కూడా విడుదల అవ్వబోతోంది. విజయ్ ఈ సినిమాకి తెలుగు లో బేతాళుడు అనే టైటిల్ ఫిక్స్ చేసాడు. మొదట బిచ్చగాడు సినిమాకి కూడా ఇలాగే నెగెటివ్ మార్క్ ఒచ్చింది గానీ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది.
Related
