Monday, May 20, 2024
- Advertisement -

వినాయక్ రెమ్యూనరేషన్‌ ఏంతంటే?

- Advertisement -

మెగాస్టార్ చిరు ప్రస్తుతం తన 150వ సినిమా మీదే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనేది ఇంక తెలపలేదు. తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి చిత్రంను చిరు రిమేక్ చేస్తుండగా రామ్ చరణ్ ఈ చిత్రంను నిర్మిస్తున్నారు. ఇటివలే మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు రెండో షెడ్యూల్ కి రెడీ అవుతోంది.

ఈ చిత్రంలో నటించే హీరోయిన్ ఎవరు అనేది ఖరారు కాకపోయిన చిరు మాత్రం ఎక్కడ కూడా బ్రేక్ ఇవ్వకూండా తనకు సంబంధించిన సీన్స్ చేస్తున్నాడు. ఇక మొదటి షెడ్యూల్ లో తీసిన సీన్స్ సరిగ్గా రాలేదు అని చిరు వినాయక్ తో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండో షెడ్యూల్ కంప్లీట్ చేసాక మొదటి షెడ్యూల్ కు సంబంధించి సీన్స్ ను మళ్లీ రీషూట్ చేయనున్నారట.

రెండో షెడ్యూల్‌ జరుగుతుండగానే మూడో షెడ్యూల్‌ పై క్లారిటీ వచ్చేసింది. రామానాయుడు స్టూడియోస్‌ లో తోటతరణి వేసిన సెట్ లో మూడో షెడ్యూల్‌ షూట్ జరగనుందట. ఇక ఈ చిత్రం కోసం వినాయక్ రెమ్యునరేషన్‌ తీసుకోవడం లేదట. ఆ స్థానంలో ఈస్ట్‌ గోదావరి రైట్స్‌ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అక్కడ 5.50 కోట్లు పలికింది ఈ సినిమా.

Related

  1. చిరు సినిమా టైటిల్ ఇదే?
  2. చిరుతో మెగా హీరోస్ అదిరిపోయే డాన్స్!
  3. పూరిని మళ్లీ లైన్‍లో పెట్టిన చిరు!
  4. చిరు మొదలు పెట్టేసాడు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -