Sunday, April 28, 2024
- Advertisement -

చిరు మాస్ ట్రీట్ విత్ మాస్ రాజా గెట్ రెడీ!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ” వాల్తేరు వీరయ్య ” . బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా రోజుల తరువాత ఈ మూవీతో చిరును పక్కా మాస్ అవతార్ లో చూపించబోతున్నారు డైరెక్టర్ బాబీ. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టైటిల్ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల బాస్ పార్టీ పేరుతో రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇక ఇప్పుడు టీజర్ రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ టీజర్ కూడా ఊర మాస్ గా ఉండే విధంగా కట్ చేస్తున్నారట. ఈ మూవీలో మాస్ రాజ రవితేజ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో టీజర్ లో అటు మెగాస్టార్ అభిమానులను, ఇటు మాస్ రాజ అభిమానులను అలరించే విధంగా టీజర్ ఋపొందించబోతున్నట్లు సమాచారం. .

గతంలో చిరంజీవి అన్నయ్య మూవీలో మెగాస్టార్ తమ్ముడిగా నటించిన రవితేజ.. మళ్ళీ ఇన్నాళ్లకు చిరు తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. దాంతో ఇద్దరు మాస్ క్రాకర్స్ చేసే రచ్చ ఎలా ఉంటుందో అని అభిమానులు క్యూరియాసిటితో ఎదురు చూస్తున్నారు. ఇక వాల్తేరు వీరయ్య మూవీ ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంక్రాంతికి చిరు తో పాటు నటసింహా నందమూరి బాలకృష్ణ మరియు తమిళ్ హీరో తలపతి విజయ్ కూడా రేస్ లో ఉన్నారు. ఇప్పటికే బాలయ్య జనవరి 12 న రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించని వాల్తేరు వీరయ్య టీమ్ టీజర్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఫిల్మ్ సర్కిల్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం మూవీ టీజర్ ను క్రిస్మస్ కనుక విడుదల చేయబోతున్నారని సమాచారం. మరి వింటేజ్ లుక్ తో పక్కా మాస్ అవతార్ లో కనిపిస్తున్న చిరు ” వాల్తేరు వీరయ్య ” ఎలాంటి సక్సస్ అందుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

బుచ్చిబాబుకు చరణ్ ఫ్యాన్స్ తో ఇబ్బందే!

చిరు, బాలయ్య తో భారీ మల్టీ స్టారర్.. బడా ప్రొడ్యూసర్ క్లారిటీ !

ఆదిపురుష్ కష్టాలు.. వచ్చే ఏడాది కూడా డౌటే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -