Thursday, May 9, 2024
- Advertisement -

హిట్ యూనివర్స్ లో బాలయ్య.. నిజమైతే పూనకాలే !

- Advertisement -

తెలుగు సినీ ఇండస్ట్రీలో అదిరిపోయే మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో బాలయ్య ముందు వరుసలో ఉంటాడు. ఆయన సినిమాలలో కొత్తదనం లేకపోయిన పర్వాలేదు గాని అదిరిపోయే మాస్ ఎలిమెంట్స్ లేకపోతే ఆయన అభిమానులు తీవ్రంగా డిస్సపాయింట్ అవుతారు. దాంతో అబిమానులను ఖుషీ చేసేందుకు బాలయ్య ఎక్కువ శాతం మాస్ అంశాలు ఉన్న కథలనే ఎంచుకుంటూ ఉంటారు. అయినప్పటికి ఆయన కొత్తరకం కథలలో కూడా నటించేందుకు కూడా ఆసక్తి కనబరుస్తూనే ఉంటారు. భైరవద్వీపం, అధిత్య 369, పాండురంగడు, గౌతమీ పుత్ర శాతకర్ణి.. ఇలా చాలా మూవీస్ లో ప్రేక్షకులకు తనలోని కొత్తదనాన్ని పరిచయం చేశాడు బాలయ్య. ఇదిలా ఉంచితే.. ఇటీవల అడవి శేష్ నటించిన ” హిట్ 2 ” మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది..

పక్కా థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ” హిట్ 2″ మూవీ ఆడియన్స్ కు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ పంచుతూ అదిరిపోయే వసూళ్లను రాబౌతోంది. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో అందరినీ ఫిదా చేస్తోంది. ఇండస్ట్రీలోని బడా హీరోలు సైతం మూవీపై ప్రశంశలు కురిపిస్తున్నారు. తాజాగా బాలయ్య, ఆయన తనయుడు మోక్షజ్ఞ ” హిట్ 2 ” మూవీని చూసి చిత్రయూనిట్ పై ప్రశంశలు కురిపించారు. అయితే ఈ నేపథ్యంలో బాలయ్యను హిట్ యూనివర్స్ లో నటించమని అడవి శేష్ కోరాడట. దానికి బాలయ్య చిన్న స్మైల్ ఇచ్చిడని అడవి శేష్ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చాడు. అయితే థ్రిల్లర్ జోనర్ లో మూవీస్ చేయని బాలయ్య.. ఒకవేళ హిట్ యూనివర్స్ లో చేస్తే బాక్సాఫీస్ షేక్ అవుతుందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మరి బాలయ్య ను నిజంగానే హిట్ యూనివర్స్ లో తీసుకురావడానికి డైరెక్టర్ శైలేష్ ప్రయత్నిస్తాడా ? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికి నటసింహ నందమూరి బాలకృష్ణ థ్రిల్లర్ జోనర్ లో మూవీ అంటే.. ఆ ఊహే అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. మరి బాలయ్య ఫ్యూచర్ లో థ్రిల్లర్ జోనర్ లో నటిస్తాడేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

లోకేశ్ కోసం తెలుగు హీరోలు వెయిటింగ్!

హర్రర్ మూవీలో ప్రభాస్.. ఓన్లీ తెలుగులోనే!

భారీ బయోపిక్ ను రిజక్ట్ చేసిన మహేశ్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -