Friday, May 3, 2024
- Advertisement -

కే‌సి‌ఆర్ డుమ్మా కొట్టడానికి కారణం అదే !

- Advertisement -

ప్రధాని మోడి అధ్యక్షతన ఇటీవల జీ20 సదస్సు సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి దేశ నలుమూలల నుంచి ప్రభుత్వ ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. భారత్ అధ్యక్షతన వచ్చే ఏడాది సెప్టెంబర్ లో ప్రపంచ దేశాలతో జీ20 శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు వేస్తోంది కేంద్రప్రభుత్వం. అందులో భాగంగానే దేశంలోని అన్నీ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించి వారిచ్చే సలహాలను, సూచనలను మరియు అభిప్రాయాలను తెలుసుకొని కలిసికట్టుగా జీ20 శిఖరాగ్ర సమావేశాలను విజయవంతం చేయాలని భావించి అన్నీ పార్టీల నేతలకు ఆహ్వానం పంపింది మోడీ సర్కార్.

ఇక ఈ సమావేశానికి ఏపీ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, తమిళనాడు సి‌ఎం స్టాలిన్, ఉత్తర ప్రదేశ్ సి‌ఎం మమతా బెనర్జీ.. వంటి ఎందరో కీలక నేతలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ మాత్రం దూరంగా ఉన్నారు. కేంద్రప్రభుత్వం ఆహ్వానం పంపినప్పటికి కే‌సి‌ఆర్ మాత్రం మొఖం చాటేశారు. కనీసం పార్టీ లోని ఇతర నేతలను కూడా పంపే ప్రయత్నం చేయలేదు. దీన్ని బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఏ సమావేశానికి కే‌సి‌ఆర్ హాజరు కాకూడదని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే గత కొన్నాళ్లుగా కేంద్రప్రభుత్వం పై కే‌సి‌ఆర్ వార్ కొనసాగిస్తున్నారు.

బిజెపి ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ, పోలిటికల్ హిట్ పెంచుతున్నారు. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని గద్దె దించేంచడమే ప్రధాన లక్ష్యంగా కే‌సి‌ఆర్‌ ముందడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సమావేశాలకు కే‌సి‌ఆర్ గాని, టి‌ఆర్‌ఎస్ నేతలు గానే హాజరైతే.. కే‌సి‌ఆర్ వాణ్ని తాటాకు చప్పుళ్లే అనే భావన కలిగే అవకాశం లేకపోలేదు. అందుకే జీ 20 సదస్సు ప్రతిష్టాత్మకమైనదే అయినప్పటికి.. కే‌సి‌ఆర్ ఆ సమావేశానికి హాజరు కనట్లు తెలుస్తోంది. అయితే బీజేపీపై ఎప్పుడు నిప్పులు చెరిగే మమతబెనర్జీ హాజరు కావడంతో.. కే‌సి‌ఆర్ కూడా హాజరవ్వాల్సింది అనే అభిప్రాయాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కేంద్రంతో కొనసాగిస్తున్న వార్ లో వెనక్కి తగ్గేదెలేదు అన్నట్లుగా కే‌సి‌ఆర్ వ్యవహరిస్తున్నారనేది తాజాగా జరిగిన జీ20 సదస్సు సమావేశంతో మరోసారి నిరూపితం అయింది.

ఇవి కూడా చదవండి

జగన్ కు బీసీ పై ప్రేమ.. ఇప్పుడేందుకు?

గుజరాత్ పై జెండా పాతేది ఎవరు.. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి ?

జగన్ను ప్రశ్నించడమే నేరమా.. ఎందుకీ దాడులు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -