Sunday, May 12, 2024
- Advertisement -

పెళ్లి చూపులు డైరక్టర్ ను చంపేశారు… అసలు ఏం జరిగింది..?

- Advertisement -
pelli chupulu director tarun bhaskar killed by ntr fans

గత ఏడాది వచ్చిన పెళ్లిచూపులు సినిమా ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. విజయ్ దేవరకొండ,రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. అయితే ఈ దర్శకుడు ఎన్టీఆర్ ను ఉద్దేశించి ఏదో అన్నాడని టార్గెట్ గా చేసుకున్నారు అభిమానులు. తరుణ్ భాస్కర్ వికీపీడియా పేజీలోకి వెళ్లి దాన్ని దారుణమైన రీతిలో ఎడిట్ చేశారు. పర్సనల్ లైఫ్ కాలమ్ లో తరుణ్ భాస్కర్ చనిపోయినట్లుగా ఎడిట్ చేసి.. దాన్ని స్క్రీన్ సేవర్ తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు.

వికీపీడియాలో ఎవరైనా ఏదైనా ఎడిట్ చేయొచ్చు. కానీ తర్వాత వికీ టీం ఏవైనా తప్పులుంటే సరి చేస్తుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కొందరు ఆకతాయిలు ఇలా అతి చేస్తుంటారు. ఎన్టీఆర్ అభిమానులే చేశారా.. లేక వాళ్ల పేరు చెప్పి ఎవరైనా ఇలా చేశారా అన్నది క్లారిటీ లేదు కానీ.. ఇప్పుడు జరిగింది మాత్రం టూమచ్. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్, తరుణ్ భాస్కర్ కు వివాదం ఎలా మొదలయ్యిందంటే.. పెళ్లిచూపులు సినిమాను ఐఫా అవార్డుల వాళ్లు గుర్తించకపోవడంపై కొంత కాలం కిందట తరుణ్ భాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

అయితే రిసెంట్ గా జాతీయ అవార్డుల్లో ఈ చిత్రం రెండు పురస్కారాలు దక్కించుకుంది. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూలో ఇచ్చిన తరుణ్.. ఇంతకుముందు తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశాడు. తనకు అవార్డు వేడుకలకు సంబంధించి పెద్దగా అవగాహన లేదని.. ఐతే కొంతమంది ఇండస్ట్రీ వాళ్లు ఫోన్ చేసి వాటి గురించి వివరించారని.. తన లాంటి వాళ్లకు అవార్డులిస్తే జనాలు చూడరని.. కాబట్టి టీఆర్పీల కోసం స్టార్ల సినిమాలకు అవార్డులు ఇవ్వక తప్పదని తనకు నచ్చ జెప్పారని అన్నాడు. అయితే ఎన్టీఆర్ సినిమా జనతా గ్యారేజ్ కు టీఆర్పీ కోసమే అవార్డు ఇచ్చారన్న ఉద్దేశం వచ్చేలా మాట్లాడాడంటూ దీన్ని పెద్ద వివాదం చేశారు సోషల్ మీడియాలో జనాలు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా చెప్పుకునే జనాలు రెచ్చిపోయారు. దీంతో తరుణ్ వాళ్లకు సారీ చెబుతూ పెద్ద ఫేస్ బుక్ పోస్టు పెట్టాడు.

{youtube}AdHXzoXeqVo{/youtube}

Related

  1. మాజీ లవర్.. ఓ రోజు మాతో పడుకుంటావా అని అడిగినందుకు.. ఏ నటి ఏం చేసిందో తెలుసా..?
  2. హీరోయిన్ కొంప ముంచిన హీరో.. ఏం జరిగింది..?
  3. విడాకులు తీసుకున్న సుమంత్.. ఇప్పుడు ఎవరి ప్రేమలో ఉన్నాడో తెలుసా..?
  4. యాంకర్ లాస్య తల్లి కాబోతుంది..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -