Saturday, April 20, 2024
- Advertisement -

బిగ్​బాస్​ హోస్ట్​ ఎవరు? కమల్​హాసనా.. శింబునా

- Advertisement -

బిగ్​బాస్​ సీజన్​ వచ్చేస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. ఇంటి సభ్యులుగా ఎవరు రాబోతున్నారు? హోస్ట్​ ఎవరు? తదితర విషయాలపై ఎనలేని ఆసక్తి ఉంటుంది. ఈ షోలో పాల్గొనేందుకు మొదట్లో సెలబ్రిటీలు సైతం ఆసక్తి కనబరిచేవారు. కానీ రాను రాను టాప్​ సెలబ్రిటీలకు ఇంట్రెస్ట్ తగ్గింది. అందుకు కారణం.. బిగ్​బాస్​తో ఉన్న ఇమేజ్​ డ్యామేజ్​ అవుతుండడమే. ప్రస్తుతం టిక్​టాక్​ స్టార్లు, యూట్యూబ్​ స్టార్లు మాత్రమే బిగ్​బాస్​ షోల మీద ఆసక్తి కనబరుస్తున్నారు.

పెద్ద పెద్ద స్టార్లు కేవలం భారీగా రెమ్యునరేషన్​ ఆఫర్​ చేస్తే మాత్రమే ఈ షోకు ప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే తమిళ బిగ్​బాస్​ మొదటి నుంచి ఆసక్తికరంగా మారుతున్న విషయం తెలిసిందే. కమల్​ హాసన్​ వరసగా తమిళ బిగ్​బాస్​ను హోస్ట్​ చేస్తుండటంతో ఈ షోకు ఎనలేని క్రేజ్​ వచ్చి పడింది. ఇక కమల్​ హాసన్​ కూడా తనదైన స్టయిల్​లో ఆకట్టుకుంటూ ఉంటారు. ఈ సారి కమల్​ హాసన్​ హోస్ట్​ చేస్తారా? లేదా? అన్న విషయంపై ఆసక్తి నెలకొన్నది.

Also Read: ఆర్ఆర్ఆర్ : అలియాభట్ కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్..!

ప్రస్తుతం కమల్​ చేతిలో ఇండియన్​- 2, విక్రమ్ సినిమాలు ఉన్నాయి. మరోవైపు దృశ్యం తమిళ రీమేక్​లోనటిస్తున్నాడు. ఇవి కాక మరికొన్ని ప్రాజెక్టులు కూడా లైన్ లో ఉన్నాయి.మరోవైపు కమల్ రాజకీయాల్లోనూ ఉన్నాడు. దీంతో ఈ సారి కమల్​ హాసన్​ బిగ్​బాస్​ ను హోస్ట్​ చేయడం లేదు. ఆ స్థానంలోకి మరో టాప్​హీరో శింబూ రాబోతున్నాడని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై బిగ్​బాస్​ షో నిర్వాహకులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

అయితే కమల్​ హాసన్​ వరసగా ఐదు సీజన్​లలో హోస్ట్​ చేసేందుకు బిగ్​బాస్​ యాజమాన్యంతో ఒప్పందం చేసుకున్నారట. ఇప్పటికే వరసగా 4 సీజన్​లలో హోస్ట్​ చేశాడు. ఒప్పందం ప్రకారం ఈ సారి కూడా హోస్ట్​ చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ సారి శింబూ కు అవకాశం ఇచ్చి.. తర్వాత సీజన్​లో కమల్​ వస్తాడా? అన్న విషయంపై క్లారిటీ లేదు. కానీ కమల్​ హాసన్​ ఒప్పందం ప్రకారం ఈ సారి కూడా హోస్ట్​ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Also Read: సౌత్​లో బన్నీ కొత్త రికార్డ్​.. విజయ్​ ని కూడా దాటేశాడే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -