మెగాఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి తరువాత అంతటి ఫాలొయింగ్ తెచ్చుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టడం,దానిని కాంగ్రెస్‌లో విలీనం చేయడం అన్ని చక చక జరిగిపోయాయి. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంపై ఆగ్రహంతో జనసేన పార్టీ పెట్టాడు చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్. 2014లో జరిగిన ఎన్నికలలో పవన్ పార్టీ ఎన్నికలలో పోటీ చేయకుండా టీడీపీకి మద్దతుగా ప్రచారం చేశాడు.
2019 ఎన్నికలలో ప్రత్యక్షంగా ఎన్నికల రంగంలోకి దూకుతున్నాడు పవన్. ఈ ఎన్నికలలో తన సత్తా ఏంటో చూపించాలని భావిస్తున్న పవన్‌కు ఆయన అన్నయ్య నాగబాబు అడ్డుపడుతున్నారని జనసేన పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. మెగా బ్రదర్‌గా పేరు తెచ్చుకున్న నాగబాబు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నాడు. కొద్ది రోజులు క్రితం టీడీపీ ఎమ్మెల్యే ,హీరో బాలకృష్ణపై కొన్ని వీడియోల రూపం అతనిపై విమర్శలు చేశాడు. గతంలో తమ కుటుంబంపై బాలయ్య చేసిన కామెంట్స్‌కు బదులుగా ఆయన బాలయ్యపై విమర్శలు చేశాడు. అయితే ఈ విషయంలో ఎక్కువుగా తమ కుటుంబం గురించే మాట్లాడాడు నాగబాబు. దీంతో నాగబాబుపై మండిపడ్డారు బాలయ్య అభిమానులు. ఈ విషయంలో సగటు ప్రేక్షకుడు కూడా నాగబాబునే విమర్శించారు.
బాలకృష్ణ తన తండ్రి బయోపిక్ ఎన్టీఆర్ కథా నాయకుడు సినిమా విడుదల సమయంలోనే నాగబాబుకు బాలయ్యను విమర్శించాలని ఎందుకు అనిపించిందని వారు ప్రశ్నిస్తున్నారు. అప్పటి వరకు ఏం చేశారని సగటు ప్రేక్షకుడు కూడా నాగబాబుని ప్రశ్నించాడు. ఇక తన తమ్ముడు పార్టీ కోసం తెగ కష్టపడిపోతున్పాడు నాగబాబు. పవన్ కోసం ప్రత్యర్థి పార్టీ వాళ్లను టార్గెట్ చేస్తున్నాడు నాగబాబు. జగన్,లోకేశ్‌లను విమర్శిస్తు నాగబాబు విడుదల చేసిన వీడియోలు పవన్‌కు మంచి చేయకపోగా చెడునే ఎక్కువు కలిగిస్తున్నాయి. కావలంటే ప్రత్యక్షంగా తన తమ్ముడికి మద్దతుగా వచ్చి వారిని విమర్శిస్తే బాగానే ఉంటుంది.కాని నాగబాబు అలా కాకుండా గొడ మీద పిల్లిలా కుర్చోని ప్రత్యర్థి పార్టీల మీద విమర్శలు చేయడం ఎంత వరకు సమాంజసమో ఆయనే తెలపాలని రాజకీయ విశ్లేషకులు అడుగుతున్నారు. పైగా ఏపీలో ఓటు హక్కు లేని నాగబాబు ఏపీ రాజకీయలపై కామెంట్స్ చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. మీకు మీ తమ్ముడి మీద అంత ప్రేమ ఉంటే ఆయన తరుపున నిలబడి ప్రచారం చేయమని ప్రత్యర్థి పార్టీ వారు నాగబాబుకు హితవు పలుకుతున్నారు. మరి ఇప్పటికైన నాగబాబు ప్రవర్తనలో మార్పు వస్తుందేమో చూడాలి.
- Advertisement -
పవన్ కొంప ముంచుతున్న మెగా బ్రదర్ నాగబాబు
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -
