Saturday, May 18, 2024
- Advertisement -

వైసీపీలోకి ప‌రిటాల ర‌వి ముఖ్యఅనుచ‌రుడు

- Advertisement -

ఎన్నిక‌ల స‌మ‌యం ప‌డుతున్న కొద్ది అనంత‌పురం రాజీకాయాలు వేడెక్కుతున్నాయి. మంత్రిప‌రిటాల సునీత‌కు వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి. త్వ‌ర‌లో మంత్రికి బిగ్ షాక్ త‌గ‌ల‌నుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ప‌రిటాల ర‌వికి ముఖ్యనుచ‌రులుగా ఉన్న నేత‌లు పార్టీని వీడి వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌వుతున్నారు.

2014 ఎన్నిక‌ల్లో రాప్తాడు నియోజ‌క వ‌ర్గం నుంచి గెలిచిన సునీత‌ను బాబు మంత్రి వ‌ర్గంలోకి తీసుకున్నారు. మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టినుంచి కేవలం కొందరి ప్రయోజనాలకు మాత్రమే పెద్ద పీట వేస్తున్నారంటూ ఆరోపణలు మొదలయ్యాయి. మండ‌ల స్థాయిలో ప‌ద‌వుల‌న్ని కూడా పరిటాల కుటుంబీల దగ్గరే ఉన్నాండ‌టంతోపాటు శ్రీరామ్ ఆగ‌డాలు కూడా పెరిగిపోయాయినే ఆరోప‌న‌లు వినిపిస్తున్నాయి.

పరిటాల రవి ఉన్నంత వరకూ పరిటాల కుటుంబానికి అండగా ఉన్న కీలకమైన వ్యక్తులు దూర‌మ‌వుతున్నారు. కమ్మేతర కులాలు ఎక్కువగా బిసిల్లో పరిటాల కుటుంబంపై వ్యతిరేకత పెరిగిపోయింది. బిసిల్లో కూడా వాల్మీకి ఉపకులంలో అయితే తల్లీ, కొడుకులపై ఒక విధంగా తిరుగుబాటే మొదలైంది. ఇటువంటి నేపధ్యంలోనే సునీత వ్యతిరేకులంతా రాప్తాడు నియోజకవర్గంలో కీలక సమావేశం పెట్టుకున్నారు.

పరిటాల ముఖ్య అనుచరుల్లో ఒకడైన వేపకుంట రాజన్న మంత్రి సునీత‌పై తిరుగుబావుట ఎగ‌రేశారు. ప‌రిటాల వ్య‌తిరేక వ‌ర్గంతో… రాజ‌న్న స్వగ్రామం తల్లిమడుగులలో టీడీపీ నేతలు, అనుచరులతో నిర్వహించిన సమావేశం నిర్వ‌హించారు. చంద్రబాబు, సునీత పాలనలో పేదలకు తీరని అన్యాయం జరుగుతోందని స‌మావేశంలో మండిపడ్డారు. రాప్తాడు నియోజ‌క వ‌ర్గంలో మంత్రి సునీత కుటుంబ పాల‌న సాగిస్తున్నార‌ని ఆరోపించారు. సునీత వైఖరి వల్లే తాను నాలుగేళ్లుగా టీడీపీకి దూరంగా ఉంటున్నట్టు తెలిపారు.

తల్లిమడుగుల గ్రామంలో జరిగిన సమావేశానికి టిడిపి జడ్పిటీసీ మాజీ సభ్యుడు మామిళ్ళపల్లి పెద్దప్పయ్య, వెంకటరామిరెడ్డి, గంగంపల్లి జేష్ఠరామయ్య తో పాటు పెద్ద ఎత్తున బాధితులు హాజరయ్యారు.పేద‌ల‌కు మంచి చేయాల‌నే ఉద్దేశ్యంతోనే ర‌వితో క‌ల‌సి న‌డిచామ‌న్నారు. భర్త మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన సునీత ఆయన ఆశయాలను పక్కనపెట్టారని ఆరోపించారు.

సునీత బాధలు పడలేకపోతున్న కారణంగా తొందరలోనే వాళ్ళంతా టిడిపిని వదిలేపి వైసిపిలో చేరాలని కూడా డిసైడ్ అయ్యారు. త్వరలోనే జగన్ సమక్షంలో రాజ‌న్న‌ వైసీపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. ఆయ‌న‌తో పాటు మ‌రి కొంత మంది నేత‌లు కూడా పార్టీలో చేర‌నున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -