Monday, May 6, 2024
- Advertisement -

విశాఖ లో అమాంతం పెరిగిన భూముల ధరలు..?

- Advertisement -

ఏ ముహూర్తాన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి విశాఖ మారిందో కానీ అక్కడి భూములకు ఒక్కసారిగా రెక్కలిచ్చినట్లు తయారైంది పరిస్థితి.. ఒక్కసారి గా డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. అంతకు ముందు పరిస్థితి అంతా నార్మల్ గా ఉన్నా రాజధాని ప్రకటించిన వెంటనే పరిస్థితులు తారుమారైయ్యాయి.. భూముల క్రయవిక్రయాల్లో తేడాలు భారీగా వచ్చేశాయి. జనవరి లో ముఖ్యమంత్రి అసెంబ్లీ లో మూడు రథధ్వనుల నిర్ణయం చెప్పారు.. అప్పటినుంచి అక్కడి భూములకు డిమాండ్ తెగ పెరిగిపోయింది. విశాఖ రాజధానితో పాటు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణం కూడా విశాఖలో భూముల ధరలు పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు.

వాస్తవానికి అంతకుముందు కూడా విశాఖ భూములకు గిరాకీ బాగానే ఉండేది. అందుకు అక్కడి ప్రశాంత వాతావరణం.. ఆహ్లాదకరంగా నగరం గా విశాఖ కు ఉమ్మడి రాష్ట్రంలోనే మంచి పేరు ఉండేది.. ఎక్కువ మంది ఆంధ్రులు అక్కడ స్థిరపడడానికి ఇష్టపడేవారు. దీంతో పాటు అనేక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉండటం కూడా విశాఖకు కలసి వచ్చింది. నిజానికి జనవరి నెలనుంచే విశాఖలో భూముల క్రయవిక్రయాలు పెరగాల్సి ఉంది. మార్చి నెలలో కరోనా రావడంతో దాదాపు మూడు, నాలుగు నెలలు క్రయవిక్రయాలు జరగలేదు. అయితే తాజాగా భూముల రిజిస్ట్రేషన్లు విశాఖలో పెరిగాయి. ఇప్పుడు విశాఖలో భూములు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. విశాఖ నగరంతో పాటు దాని శివారు ప్రాంతాల్లోనూ భూముల కొనుగోళ్లకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇక విశాఖ సిటీలో అయితే చదరపు గజం ధర లక్ష వరకూ పలుకుతుండటం విశేషం.

జులై నెలనుంచి విశాఖ లో రిజిస్టేషన్స్ పెరిగాయని చెప్పొచ్చు.. ఒక్క ఆగస్టు నెలలోనే దాదాపు ఐదువేల రిజిస్ట్రేషన్స్ జరిగాయి.. దీంతో ప్రభుత్వ ఆదాయం కూడా చాలా పెరిగింది. ఇక రానున్న కాలంలో అభివృద్ధి పెరుగుతున్న కొద్దీ విశాఖ లో భూములకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు..  విశాఖ రాజధానిగా ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకంతోనే భూముల క్రయ విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెబుతున్నారు. మరి విశాఖ లో రాజధాని అటు ఇటు అయితే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి..

వైఎస్సారా మజాకా.. ఇంకా తలుచుకుంటున్న జనం…?

చంద్రబాబు అవినీతి కి ఎందుకు కొమ్ము కాస్తున్నాడు.?

జగన్ చంద్రబాబు చేసే తప్పు చేస్తున్నాడా.. అయితే కష్టమే..?

చంద్రబాబు డ్రామాలకు హద్దులు లేవా.?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -