Saturday, May 11, 2024
- Advertisement -

ఆకలి వేయడం లేదా.. అయితే ఇలా చేయండి !

- Advertisement -

నేటి ఉరుకుల పరుగులు జీవితంలో మనిషి ఎంతో ఒత్తిడికి గురౌతుండడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలతో సతమతమౌతున్నాడు. ముఖ్యంగా నిద్రలేమి, మలబద్దకం, ఆకలివేయకపోవడం వంటి సమస్యలు తలెత్తడం సర్వసాధారణం అయిపోయింది. చిన్న సమస్యలే కదా అని నిర్లక్ష్యం వహిస్తే.. పెను అనార్థాలకు దారి తీసే అవకాశం ఉంది. ఏదో పనిలో పడి సమయానికి తినడం మానేస్తారు చాలామంది. ఫలితంగా గ్యాస్ ఫామ్ అయ్యి కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే సరైన సమయనికి ఆకలి వేయడం కూడా చాలా ముఖ్యం. మరి ఆకలి బాగా వేయడానికి ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్న కొన్ని చిట్కాలను తెలుసుకుందాం !

*ఉదయం పుట పడిగడుపున ఒక గ్లాస్ మంచి నీరు తాగాలని ఎంతోమంది నిపుణులు సూచిస్తున్నప్పటికి చాలా మంది నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. ఉదయం పూట ఒక గ్రాస్ మంచి నీరు తాగడం వల్ల.. జీవక్రియ మెరుగుపడే అవకాశం చాలా ఎక్కువ.. ఫలితంగా ఆకలి బాగా వేయడానికి దోహదపడుతుంది. ఇంకా కాస్త నిమ్మరసం యాడ్ చేస్తే మరి మంచిదని అలా చేయడం వల్ల.. మలబద్దకం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.

*ఆకలి బాగా వేసేందుకు రోజు భోజనం చేసే సమయానికి ముందు కాస్త అల్లం రసం సేవించమని కూడా నిపుణులు చెబుతున్నారు. అల్లంలో ఉండే బయోటిక్స్ జీవ క్రియను మెరుగు పరుస్తుందట.

*ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడిని ఒక గ్లాస్ మంచి నీటితో కలిపి తడగం వల్ల కూడా మలబద్దకం, ఆకలివేయకపోవడం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

*ఉసిరి రసం కూడా బాగా ఆకలి వేయడంలో సహాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ ఉసిరిరసం ఒక గ్లాస్ మంచి నీటితో పాటు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

అన్నిటికంటే ముఖ్యంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా సరైన సమయానికి భోజనం చేయడం చాలా ముఖ్యమని.. అలాగే రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ మంచి నీరు తీసుకోవడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

చలికాలంలో వేడి నీళ్ళతో స్నానం చేస్తే.. అంతే సంగతులు !

ఈ జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ రాదట!

రాత్రి నిద్రించే ముందు ఈ ఆహారంతో ఆరోగ్యానికి మేలు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -