Thursday, May 2, 2024
- Advertisement -

వ్యాక్సిన్​తో లైంగికసామర్థ్యం తగ్గదు..! తేల్చిచెప్పిన అధ్యయనం..!

- Advertisement -

కరోనా వ్యాక్సిన్​ మీద వచ్చినన్ని పుకార్లు.. మరే టీకా మీద రాలేదేమో. మనదేశంలో కరోనా వ్యాక్సిన్​పై అనేక తప్పుడు వార్తలు ప్రచారం అయ్యాయి. అందుకే ప్రారంభంలో చాలా మంది వ్యాక్సిన్​ వేయించుకొనేందుకు ముందుకు రాలేదు. ఓ దశలో వైద్య వర్గాలే వ్యాక్సిన్​ వేయించుకోలేదు. దీంతో సామాన్య ప్రజల్లో భయం నెలకొన్నది.

కరోనా వ్యాక్సిన్​తో కొన్ని సైడ్​ ఎఫెక్ట్స్​ ఉంటాయన్నది నిజమే. అయితే సోషల్ మీడియాలో మాత్రం సైడ్​ ఎఫెక్ట్స్​ మీద ఎక్కువ తప్పుడు ప్రచారం సాగింది. వాటిలో ఒకటి కరోనా వ్యాక్సిన్​ తీసుకుంటే లైంగిక సామర్థ్యం తగ్గుతుందని.. వీర్యకణాల సంఖ్య క్షీణిస్తుందని ఓ ప్రచారం సాగింది. దీంతో యువత భయాందోళనకు గురైంది. ఈ విషయంపై తాజాగా అమెరికాలో ఓ అధ్యయనం సాగింది. కరోనా వ్యాక్సిన్​ తీసుకుంటే వీర్య కణాల సంఖ్య తగ్గదని సదరు అధ్యయనం తేల్చి చెప్పింది.

Also Read: మధ్యప్రదేశ్​లో గ్రీన్​ఫంగస్​..

అమెరికాలో ఫైజర్​, మోడెర్నా టీకాల మీద ఓ అధ్యయనం సాగింది. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న 45 మంది వలంటీర్లపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్​ మియామి పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనం ఎలా సాగిందంటే.. తొలి డోసు ఇచ్చేందుకు ఏడు రోజుల ముందు వలంటీర్ల నుంచి వీర్యం సేకరించారు. ఆ తర్వాత వారికి రెండు డోసులు ఇచ్చి.. 70 రోజుల తర్వాత మరోసారి వీర్యం తీసుకున్నారు. అయితే టీకా ఇచ్చేందుకు ముందు వీర్య కణాల పరిమాణం ఎలా ఉంది? టీకా ఇచ్చిన తర్వాత వీర్య కణాల సామర్థ్యం ఎలా ఉంది? అనే విషయాలపై అధ్యయనం చేశారు.

అయితే కరోనా టీకా తీసుకున్నా.. వీర్య కణాల సంఖ్య, చలన శీలతలో ఎటువంటి మార్పు లేదని ఈ అధ్యయనం తేల్చింది. కరోనా టీకాకు వీర్యకణాల సంఖ్య, లైంగిక సామర్థ్యానికి ఎటువంటి మార్పు లేదని ఈ అధ్యయనం తేల్చింది. ప్రస్తుతం మనదేశంలో కోవిషీల్డ్​, కోవాక్జిన్​ ఇస్తున్నారు. అక్కడ అధ్యయనం జరిగింది ఫైజర్​, మోడెర్నాలపై. శాస్త్రవేత్తలు మాత్రం మనదేశంలో ఇచ్చే వ్యాక్సిన్​ల వల్ల కూడా లైంగిక సామర్థ్యం , వీర్య వృద్ధి మీద ఎటువంటి ప్రభావం ఉండదని చెబుతున్నారు.

Also Read: థర్డ్​వేవ్​.. చిన్నపిల్లల తల్లిదండ్రులూ బీకేర్​ఫుల్​..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -