Friday, May 17, 2024
- Advertisement -

ఆ పరిస్థితే వస్తే అల్లాలో కలిసిపోతా… పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన అలీ

- Advertisement -

ఎన్నికల ప్రచారంలో అలీ, పవన్ ల మధ్య మాటల తూటాలు పేులుతున్నాయి. ప్రచారం చివరిరోజు కావడంతో అన్ని పార్టీలు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అలీపై సంలన వ్యాఖ్యలు చేశారు. తనను వెన్నుపోటు పొడిచి, మోసం చేసి వైసీపీలోకి అలీ చేరిపోయాడంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు అలీకి ఎంతో సేవ చేశానని చేసిన వ్యాఖ్యలకు అలీ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.

ఎన్నికల ప్రచారంలో పవన్ ను తాను ఒక్కమాట కూడా మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్‌కల్యాణ్, తన అన్న చిరంజీవి వేసిన బాటలో పైకి వచ్చారని, కానీ తాను అలా కాదని తన కష్టంతోనే సినీ పరిశ్రమలో పైకొచ్చానని అలీ తెలిపారు. పవన్ సినిమాల్లోకి రాకముందే నేను పరిశ్రమలో ఒక స్థానం సంపాదించుకున్నానని గుర్తుచేశారు. ‘ఏ రకంగా పవన్‌ నాకు సాయపడ్డారు. ఏమైనా సినిమాలు లేకుంటే ఇప్పించారా? కష్టాల్లో ఉంటే ఆదుకున్నారా? లేక ఇంకేమైనా సాయం చేశారా?’ అని అలీ ప్రశ్నించారు.

నేను కూడా రాజమండ్రిలో పుట్టి పెరిగానని …తాను పుట్టిన గడ్డకు తన తండ్రి పేరును ట్రస్ట్ పెట్టుకుని కులమతాలకు అతీతంగా సేవ చేస్తున్నానని చెప్పారు. రాజమండ్రిలో పవన్ తనపై చేసిన వ్యాఖ్యలు నన్ను బాధించాయని చెప్పారు. పవన్ చుట్టుప్రక్కల ఉన్నవారు ఆలీ మీద వ్యాఖ్యలు చేయాలని చెప్పి ఉంటారని…అందువల్లే పవన్ అలా మాట్లాడి ఉంటారని పవన్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

నేను నా కష్టాన్ని నమ్ముకొని ఉన్నాను. దేహి అనే పరిస్థితి వస్తే అల్లాలో కలిసి పోతానంటూ సీరియస్ గానే అలీ కామెంట్ చేశారు. తాను చాలా జిల్లాలో వైసిపి కోసం ప్రచారం చేశానని, తాను పవన్ స్థానాన్ని గుండెల్లో పెట్టుకున్నానని అన్నారు. పవన్ పై అలీ చూపించిన అభిమానానికి పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -