Friday, May 17, 2024
- Advertisement -

జనసేనకు హైకోర్టులో నిరాశే..!

- Advertisement -

ఏపీలో కూటమి నేతలకు జనసేన గాజు గ్లాస్ సింబల్ నిద్రలేకుండా చేస్తోంది. జనసేన పార్టీకి అధికారిక గుర్తింపు లేకపోవడంతో ఆ పార్టీ సింబల్ గాజు గ్లాస్‌ను ఫ్రీ సింబల్‌గా ప్రకటించింది ఈసీ. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఫలితం లేకపోయింది. గాజు గ్లాస్ సింబల్‌ని ఫ్రీ సింబల్‌గా ఉంచలేమని న్యాయస్థానానికి తెలిపింది ఎన్నికల కమిషన్. ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ అయినందున దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేమని తెలపడంతో జనసేనతో పాటు కూటమి నేతలకు గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి.

ఏపీలో పలు నియోజక వర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసును సింబల్‌గా కేటాయించింది ఈసీ. దాదాపుగా 50కి పైగా ఎమ్మెల్యే స్థానాలు, 6 ఎంపీ స్థానాల్లో స్వతంత్రులకు గాజు గ్లాసును కేటాయించింది. ఇందులో టీడీపీ, బీజేపీకి చెందిన కీలక నేతల నియోజకవర్గాలు ఉన్నాయి.

కుప్పం,మంగళగిరి, రాప్తాడు, టెక్కలి, అద్దంకి, పర్చారు, మాచర్ల వంటి స్థానాల్లో గాజు గ్లాసుపై స్వతంత్రులు పోటీ చేయనున్నారు. జనసేన పార్టీకి సంబంధించిన గాజుగ్లాసు కూడా ఈవిఏం లలో కనిపిస్తే ప్రజలు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉండటంతో ఓట్లు చీలడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ చీలిన ఓట్లతో ఎవరికి లాభం అవుతుందో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -