Sunday, May 19, 2024
- Advertisement -

మాజీ సీఎంల వారసులు గెలిచేనా?

- Advertisement -

ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈసారి ఎన్నికల బరిలో కొన్ని నియోజకవర్గాల్లో నారీమణుల పోటీ నెలకొనగా మరికొన్ని నియోజకవర్గాల్లో సీనియర్ నేతలతో కొత్త నేతలు తలపడుతుండగా మరికొన్ని నియోజకవర్గాల్లో మాజీ సీఎంల వారసులు బరిలో ఉన్నారు. ఆరు గురు సీఎంలకు చెందిన ఎనమిది మంది అభ్యర్థులు ఎన్నికల క్షేత్రంలో తలపడుతుండగా గెలుపు ఎవరిని వరిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దివంగత సీఎం వైఎస్ , కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దర్ రెడ్డి,చంద్రబాబు,ఎన్టీఆర్,నాదేండ్ల మనోహర్‌ల వారసులు తాజా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అలాగే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారు.

దివంగత మాజీ సీఎం వైఎస్ తనయుడు ఏపీ ప్రస్తుత సీఎం జగన్ పులివెందుల బరిలో నిలిచారు. అలాగే కడప లోక్ సభ స్థానం నుండి వైఎస్ తనయ షర్మిల పోటీ చేస్తుండగా ఇక్కడ వైసీపీ నుండి అవినాష్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక మంగళగిరిలో మాజీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేస్తున్నారు.

ఎన్టీఆర్ కొడుకు బాలయ్య హిందూపూర్ బరిలో నిలవగా కూతురు పురందేశ్వరి రాజమండ్రి లోక్ సభ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. మాజీ సీఎం కోట్ల విజయ భాస్కర్ రెడ్డి , నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారులు సూర్య ప్రకాష్ రెడ్డి, రాం కుమార్ రెడ్డి, జనసేన నుండి మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.వీరిలో గెలుపు ఎవరిని వరిస్తుంది? ఓటర్లు ఎవరికి జై కొడతారో వేచిచూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -