Wednesday, May 22, 2024
- Advertisement -

ముసలోడా నీకేం పోయేకాలం.. చిన్నారిపై లైంగిక వేధింపులు!

- Advertisement -

ఈ మద్య దేశంలో మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలు, వృద్దులు, చిన్నారులపై కూడా లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి.. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కామాంధులు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా సభ్యసమాజం ఛీ ఇదేం పాడు పని అనుకునేలా 70 ఏండ్ల వృద్ధుడు ఆరేండ్ల పాపపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన రాజస్ధాన్‌ రాజధాని జైపూర్‌లో వెలుగుచూసింది. 

జైపూర్‌లోని ముర్లిపురా ప్రాంతంలో తన మనవడితో చిన్నారి ఆడుకుంటుండగా చాక్లెట్ ఇస్తా అని చెప్పి ఇంటిలోపలికి తీసుకువెళ్లిన వృద్ధుడు ఆమె ప్రైవేట్‌ భాగాలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ చిన్నారి ఎంత చీదరించుకున్నా.. పదే పదే అలాగే చేయడం మొదలు పెట్టాడు.

తర్వాత కుటుంబ సభ్యులకు ఈ విషయం బాలిక వెల్లడించడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. బాధిత బాలిక, నిందితుడు ఒకే ప్రాంతానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. 

నవజ్యోత్ సింగ్ సిద్దూకి భలే కలిసి వస్తుందే?

వీరి కాంబినేషన్ సూపర్ హిట్టే..!

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సీఎం కేసీఆర్ శుభ‌వార్త !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -