Wednesday, April 24, 2024
- Advertisement -

డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయిన జబర్ధస్త్ కమెడియన్..!

- Advertisement -

తెలుగు బుల్లితెరపై ఎంతో ఆసక్తికరంగా తనదైన కామెడీ పంచుతూ ప్రజాదరణ పొందింది ‘జబర్ధస్త్ కామెడీ షో. జబర్ధస్త్ తో పరిచయం అయిన యాంకర్ అనసూయ ఇప్పుడు వెండితెరపై తన సత్తా చూపిస్తుంది. మరికొంత మంది కమెడియన్లు టాలీవుడ్ ని దున్నేస్తున్నారు. అయితే ఇటీవల జబర్ధస్త్ కమెడియన్స్ ఇతర ఛానల్ కి వెళ్లిన విషయం తెలిసిందే.

తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జబర్ధస్త్ లో కొంత కాలంగా ఎన్నో కాంట్రవర్సీలు, బాడీ షేమింగ్స్‌తో వెకిలి నవ్వులు నవ్వుతున్నారంటూ విమర్శలు వచ్చాయి.  తాజాగా ఓ జబర్దస్త్ కమెడియన్ వివాదంలో చిక్కుకున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అడ్డంగా దొరికాడు. మందు తాగి వాహనం నడుపుతున్నాడని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

లాక్ డౌన్ సడలించిన తర్వాత నగరంలో డ్రంక్ అండ్ డ్రైవర్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టారు ట్రాఫిక్ అధికారులు. జూబ్లిహిల్స్‌లో చేసిన తనిఖీల్లో జబర్దస్త్‌ కమెడియన్ తన్మయ్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడితో పాటు మరికొందరు ఈవెంట్ ఆర్గనైజర్స్‌ని అదుపులోకి తీసుకున్నారు. వారి వాహనాలను సీజ్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

మళ్లీ దిగివచ్చిన పసిడి ధర..

టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబో మరోసారి!

ఏపిలో పంచాయతీ ఎన్నికల మూడో దశ కోసం నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ!

ఎంసెట్ సమస్య.. ఓ కొలిక్కి.. ఇలా చేస్తే ర్యాంక్ ఫిక్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -