Monday, May 6, 2024
- Advertisement -

ఏపిలో పంచాయతీ ఎన్నికల మూడో దశ కోసం నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ!

- Advertisement -

ఏపిలో తాజాగా పంచాయతీ ఎన్నికల మూడో దశ కోసం నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 12 తుది గడువు. 17న ఎన్నికలు నిర్వహించనున్నారు.

కాగా, తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీలో 13 వందల 23 నామినేషన్లను తిరస్కరించారు అధికారులు. 12 జిల్లాల్లోని 3 వేల 249 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవి కోసం 19 వేల 491 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. వాటిలో 18 వేల 168 మాత్రమే పోటీకి అర్హత పొందారని ఎస్‌ఈసీ ప్రకటించింది.

మరోవైపు ఈ నెల 13న రెండో విడత ఎన్నికలు జరగనుండగా, మొత్తం 99,241 నామినేషన్లు దాఖలైనట్టు ఈసీ తెలిపింది. 8న ఉపసంహరణ గడువు అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను వెల్లడించనున్నట్టు ఈసీ వివరించింది.

రూ. 20 లక్షల బేస్ ప్రైస్‌తో ఐపీఎల్‌లోకి అర్జున్ టెండూల్కర్..

పాపం.. దురదృష్టం అంటే నీదే కుల్దీప్‌!

ఎంసెట్ సమస్య.. ఓ కొలిక్కి.. ఇలా చేస్తే ర్యాంక్ ఫిక్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -